top of page

11, సెప్టెంబరు 2025 గురువారము || నీకు నియమింపబడిన పని ప్రమాదకరమైనది గనుక వివేకముగా ఉండుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Sep 11
  • 1 min read

తేనెధారలు చదువుము : మత్తయి 10:5-16


‘‘ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును, పావురములవలె నిష్కళంకులునై యుండుడి.’’ - మత్తయి 10:16


మత్తయి 10వ అధ్యాయంలో యేసుప్రభువు తన శిష్యులు సాక్ష్యులుగా బయలు వెళ్ళుటకు కొన్ని గొప్ప నియమాలు తెలియచేసెను. ఇవి ప్రస్తుతానికి, నిత్యత్వమునకు కూడ ఎంతో మేలైనది. తన శిష్యులను తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెలను పంపునట్లు పంపుచున్నాని యేసు చెప్పెను. పాలస్తీనాలో సాధారణంగా తోడేళ్ళు గొఱ్ఱెలకు సర్వసాధారణంగా విరోధంగా ఉండేవి. అవి కొండలు, లోయలలో తిరిగి అమాయకమైన, నిస్సహాయంగా ఉండే గొఱ్ఱెలను చంపి మ్రింగి వేసేవి. క్రైస్తవులు అమాయకులని లోకము తలంచును. ఎందుకంటే మనము గొఱ్ఱెలవలె సాత్వికముగాను సాధులైనట్టి, లోబడి ఉండవలెనని అనుకొందురు. గనుకనే మనలను అవమానించి, లోబర్చుకొనునప్పుడు ప్రతీకారము తీర్చుకొనము అని అనుకొని దానిని వారు అవకాశంగా తీసికొందురు. ఇక్కడ యేసు మనకొక ముఖ్యమైన సలహా ఇస్తున్నాడు. ‘‘వివేకముగా ఉండుడి’’ అని గొఱ్ఱెలవంటివారమైన మనము తోడేళ్ళు పొదలలో దాగియుండి మనలను తినివేయుటకు పొంచియుండునని ఖచ్చితంగా గ్రహింపు కలిగి యుండవలెను. అదే విధంగానే గొఱ్ఱెల వంటి మనము పాములు మరియు పావురములవలెను ఉండవలెనని చెప్పుచున్నాడు. మనము నిష్కళంకముగాను అలాగే వివేకమును కలిగియుండవలసియున్నది. కుయుక్తి గల చెడ్డవారి ఉచ్చులలో గ్రుడ్డిగా పడిపోకుండ యుండునట్లు ప్రభువు మనలను జాగృతము చేయుచున్నాడు.


ప్రియమిత్రులారా, కొందరు పాములవలె తెలివి కలిగియుందురు. కానీ పాముల వలె నిష్కళంకులుగా ఉండరు. మరికొందరైతే ఎంతో అయోమయంగాను, హాని చేయని పావురము వలె ఉందురు కానీ వారు పాములవలె వివేకముగా ఉండరు. ‘‘దయకలిగి ప్రేమకలిగి యుండుడి. కానీ, అదే సమయములో వివేకముగా ఉండుడి’’ అని యేసుప్రభువు మనకు సూచించుచున్నాడు. మన కాపరిjైున యేసుతో మనము సన్నిహితముగా ఉన్నప్పుడు ఆయనే మనలను నడిపించుచు సరైనది, సరైన సయమయులోను, సరైన స్ధలములోను చేయుటకు, చెప్పుటకును జ్ఞానమిచ్చి ఆయన సాక్షులుగా ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు తెలివి కలిగి, జ్ఞానంతోను, జాగ్రత్తగాను ప్రవర్తించునట్లు చేయును. 


ప్రార్ధన : ప్రియప్రభువా,నీ ఉవదేశమును నేను స్వీకరించి నీ సాక్షిగా బయలు వెళ్ళునప్పుడు వివేకముతో ప్రవర్తించు కృపనిమ్ము. నాపై దాడి చేయుటకు తోడేళ్ళు సిద్ధముగా ఉండునను స్పృహ కలిగి యుండుటకు సహాయము చేయుము. పామువలె నిష్కళంకముగాను ఉండు కృపనిమ్ము. నా ఆత్మకు కాపరివైన నీకు సన్నిహితంగా ఉండుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page