11 ఆగష్టు 2025 సోమవారము || దేవునియందు నమ్మికయుంచి, ఆయన చెప్పినది చేయుము
- Honey Drops for Every Soul

- Aug 11
- 1 min read
తేనెధారలు చదువుము : యిర్మియా 32:1-16
“నా తలంపులు మీ తలంపులవంటీివి కావు, మీ త్రోవలు నా త్రోవలవంటీివి కావు” ఇదే యెహోవా వాక్కు” - యెషయా 55:8
యూదావారి విగ్రహారాధనను బట్టియు, దేవునికి విరోధంగా తిరగబడుటను బట్టియు బబులోను రాజైన నెబుకద్నెజరు చేతిలో పదనున్నారని యిర్మియా ప్రకటించుచుండెను. యూదావారు 70 సం॥1లు దాసత్వములో ఉందురనియు యిర్మియా ప్రవచించెను. (యిర్మియా 25:11). ఇలా ప్రవచించుటను బట్టి అతడు చెరసాలలో బంధింపబడెను. అతడింకను చెరలో ఉండగానే బబులోనువారు వచ్చి యెరూషలేమును ముట్టడించిరి. ఇట్టి అననుకూల పరిస్థితిలో యిర్మియా యొక్క పిన తండ్రి తన కుమారుడగు హనమేలును తన కుటుంబమునకు చెందిన భూమిని కొనుమని చెప్పుటకు యిర్మియా వద్దకు పంపెను. ఆ స్థితిలో అది సబబేనా ! బబులోనువారు రాబోవు 70 సం॥లు యూదావారి దేశము స్వాధీనములో ఉండును, కానీ ఏ మాత్రము సాగుచేయలేని, కనీసం చూచుట కూడా వీలుకాని ఆ భూమిని కొని క్రయము చెల్లించుమని యిర్శియాను దేవుడు చెప్పెను. ఎందరో ఆయనను హేళన చేసి నవ్వియుండవచ్చు కానీ, అవేవియు యిర్మియాను ఆపలేదు. దేవుడు చెప్పిన దానికి అర్ధమెమి లేనట్లున్నను యిర్మియా దేవుని పట్ల నమ్మకస్థుడ్రయుందిను. అంతేకాక అతడు చెరసాలలో ఉండిన ఆ సమయాన్ని దేవునితో తన సహవాసాన్ని పెంచుకొనుటకు వాడుకొనెను. (యిర్మియా 32:16-25) దేవుని జెన్నత్యాన్ని, మహిమ, శక్తిని బట్టి అతడు దేవుని స్తుతించెను. యిర్మియా దిగ్బంధంలో ఉండినను ఆ చెరలోనే అతడు దేవునివైపు మళ్ళుకొనెను.
ప్రియ మిత్రులారా, మనకర్థంకాని, అర్ధము లేనట్లుండే విషయాలను చేయుమని కొన్నిసార్లు దేవుడు మనలనడుగును. ఆయన చేయునదేమో మనకు తెలియకపోయినను ధైర్యముగా మంచి చేయుటకు ఆయనయందు మనము నమ్మకయుంచుదము. అట్టి పరిస్థితులలో ప్రార్ధించుట కంటె మించినదేమియు లేదు ! మనకున్న కలవరము భయాల మీదనుండి మన దృష్టిని దేవుని మీదకు మరల్చినప్పుడు సమస్తము ఆయన స్వాధీనమందే యున్నదను ఆయన నిశ్చయతను మనమనుభవించుదుము. ఆయన పట్ల మన సమర్పణకు, నమ్మకత్వమునకు మనము తప్పక బహుమానము లేక ప్రతిఫలము పొందుదుము.ప్రారన :- ప్రియప్రభువా, నా జీవితంలో నీవనుమతించిన కొన్ని విషయాలను గూర్చ్లి కలవరముతో ఉన్నాను. నీవు నాకు చేయుమని చెప్పినదేదో, ఎందుకో నాకర్ణము కానప్పటికిని నా జీవితంలో ఒక మంచి ప్రణాళిక కలిగియున్నావని ధైర్యముతో దాని వివరాలేవియు నాకు తెలియనప్పటికిని, దైర్యము కలిగి నీయందు నమ్మికయుంచి నీవు చెప్పిన పని చేయుటకు సహాయము చేయుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments