top of page

10, జూలై 2025 గురువారము || దేవుని వైపుకు మళ్ళుకొనుటకు ఇదియే సమయము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 10
  • 1 min read

తేనెధారలు చదువుము : లూకా 15:11-24



‘నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి - తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను, నీ యెదుటను పాపము చేసితిని... అని చెప్పుదును...’’ 

- లూకా 15:18


ఈ ఉపమానములో తన భాగము తీసికొని ఇల్లు విడిచి పాపములో జీవించి ఆస్తినంతయు వ్యర్థము చేసికొనక ఆ చిన్న కుమారుని గూర్చి యేసుప్రభువు చెప్పెను. తన ధనమంతా ఖర్చయిపోయినప్పుడు పందులను మేపు ఉద్యోగము చేసెను. సాధ్యమైనంతగా క్రింది స్థాయికి దిగజారెను. అప్పుడు వాడు ఆ పందుల మధ్య ఆకలితోను, నిస్సహాయతతోను, నిరాశతోను కూర్చుని తన యింటిని, తన తండ్రిని, అక్కడ ఉన్న దాసులను గూర్చి తలంచి ‘‘అప్పుడు స్పృహలోనికి వచ్చెను’’ (లూకా 15:17). వాడు తాను అప్పటివరకు వెళ్ళుచుండిన దిశను మార్చుకొని తన తండ్రి ఇంటికి వెళ్ళి తానెంత తప్పు చేసెనో ఒప్పుకొనగోరెను. తన తండ్రి ప్రేమ, కనికరము, మంచితనము, దాతృత్వము, దయను జ్ఞాపకము చేసికొని ఆయన క్షమాపణ కోరవలెననుకొనెను. న్యాయంగా తీర్పు పొందవలసిన అతడు తండ్రి దయపొందునను నిరీక్షణతో ఆయన పాదాలపై పడుటకు సిద్ధపడెను. మనస్సులో కలిగిన ఇట్టి మారుయే మారుమనసు లేక పశ్చాత్తాపము. పశ్చాత్తాపమనగా ఎవరైన ఒక మార్గాన వెళ్ళుచు పాతాళ అగాధమంత లోతుకు వెళ్ళి ఇక ఏ మాత్రమును ముందుకు వెళ్ళలేనని గ్రహించి మలుపు తిరిగి నూతన దిశగా వెళ్ళుటయే. మన పాపము నుండి మళ్ళుకొని దేవుని వైపుకే తిరిగి చేరుటయే మారుమనస్సు.


ప్రియ మిత్రులారా, పాపకూపములో మనమెంత అడుగు భాగానికి మునిగియున్నను పాపము నుండి మళ్ళుకొని దేవుని వైపు తిరిగినట్లయితే మనకొక నిరీక్షణ కలదని ఈ ఉపమానము తెలుపుచున్నది. లేక ‘‘నేను బహుదూరమేగితిని గనుక నేను  రాలేను’’ అన్నట్లయితే నీవు సాకులు చెప్పుచు అపరాధభావముతో ఉన్న ప్రతి పాపికి దేవుడు ఇస్తున్న ఆహ్వానాన్ని నీవు ఒప్పుకొనుటలేదని. ఇప్పుడైనను తండ్రి వద్దకు రమ్ము. ఆయన మనలను క్షమించుటయే కాక దత్తపుత్రాత్మను మనకిచ్చి, తన పిల్లలుగా స్వీకరించి, క్రీస్తుతో కూడా సహవారసులుగాను, దేవుని వారసులుగాను చేయును.

ప్రార్ధన :- ప్రియప్రభువా, నీతో నాకుండిన సత్సంబంధమును నేను కోల్పోతిని. నీనుండి దూరమేగితిని. నీ దృష్టికి హేయమైనవి చేసితిని. నీవద్దకు వచ్చుటకు నేను యోగ్యుడిని కాను. దయగల తండ్రీ, నన్ను క్షమించి నీ బిడ్డగా నన్నంగీకరించుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page