10, జూన్ 2025 మంగళవారము || క్రీస్తు అనుగ్రహించు సమాధానము కలిగియుండుము
- Honey Drops for Every Soul

- Jun 10
- 1 min read
తేనెధారలు చదువుము : ఎఫెసీ 2:11 18
‘‘ఆయన మన సమాధానమైయుండి, విధిరూపకమైన ఆజలుగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుతచేత...’’ - ఎఫెసీ 2:14,15
యూదుల ధర్మశాస్త్రము ననుసరించుటచేతనే ఎవరైనను దేవునితో సహవానము చేయుటకు వీలగునని యూదులు నమ్ముచుండిరి.ఒక పద్ధతిలో చేతులు కడుగుకోనుట, పాత్రలు ప్రత్యేకమైన విధానములో శుద్ధి చేసుకొనుట, సబ్బాతు దినాన ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు అను నియమాలు, వివిధ పాపాలు మొ॥ వాటి కొరకు అర్పించవలసిన బలులు వంటి వేలకొలది ఆజ్ఞలు, కట్టడలు యూదా ధర్మశాస్త్రములో ఉండినవి. బలులు, దినాలను గూర్చిన అన్నిరకాల నియమాలు, ఆంక్షల మీదనే వారి మతము ఆధారపడి యుండెను, గనుక యూదులు అన్యులను తృణీకరించి వారిని వారే హెచ్చించుకొనిరి. యూదులు, అన్యులను ‘‘సున్నతి లేనివారు’’ అనియు ఇశ్రాయేలు పౌరులు కాదని, నిబంధన జనులు కాదని వారిని దూరంగా పెట్టిరి. పౌలు అయితే ఎఫెసీ 2:13లో క్రీస్తునందు ఒకప్పుడు దూరస్ధులెయుండిన వారు సమీపస్ధులై దేవునికి దగ్గరైరి అని చెప్పెను. క్రీస్తు ప్రభుని రక్తముచేత యూదులు మరియు అన్యుల మధ్య ఐక్యత పెరిగి వారు దేవునికి సమీపస్ధులైరి. ఇది ఒక ముక్కోణపు గొప్ప ఉదాహరణమైయున్నది.ఆ ముక్కోణములో శిఖరాన దేవుడు ఉండగా, రెండు వైపుల అనేక వ్యత్యాసాలతో విభజింపబడియుండిన ప్రజలున్నారు. వారెంతగా దేవునికి సమీపముగా వచ్చిరో అంతగా వారొకరికి ఒకరు సమీపన్ధులైరి.
ప్రియమిత్రులారా, స్నేహములోను, కుటుంబములోను, వివాహ బంధము మొ వాటిలోను వేరైపోవుటలో ఇది సత్యము. దీనికి మూలము పాపమే. అది మన గర్వము, స్వార్ధము, అభద్రత, అసూయ మొ॥ మనకిష్టమైనట్లుండవలెనని మనము వాదించి, పోరాదుడుము. దేవునికి మనము సమీపస్ధులమయ్యే కొలది మరెక్కువగా మనము సమీపస్థులమై ఐక్యపడదుము. మన సమాంతర సంబంధము ఎల్లప్పుడు మన నిలువు సంబంధమును ప్రభావితము చేయును. ఈ దినము మనమెవరితోనైన తెగతెంపులు చేసుకొనియున్నామా? ఆ సంబంధమును పునరుద్ధరించుకొనుటకు దేవునికి సమిస్ధులమగుటయే ఒక సుళువైన జవాబైయున్నది. మనము దేవుని చేరినప్పుడు ఆయన మన హృదయములను మార్చి, రాజీపడి ఐక్యపడుటకు మనము ప్రయత్నించగలము.ప్రార్ధన :- ప్రియప్రభువా, నీకు, పావులకు మధ్య ఉండిన శతృత్వమును క్రీస్తుప్రభువు తొలగించెను. ఆయన రక్తము చేత మనలను ఆయన ఐక్యపరిచెను. ఇతరులకు పరిచర్య చేయుటకు, ఐక్యపరచుటకు ఆయన తనును తాను తగ్గించుకొనెను. నాతో విభేదించిన వారిని నేను అంగీకరించు కృపనిమ్ము. నీకు నేను సమీపమయ్యే కొలది నా హృదయంటో మార్పు కలిగి సయోధ్య కొరకు మరింత ప్రయాసపడు కృపననుగ్రహించమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments