top of page

10, ఆగష్టు 2025 ఆదివారము || చేవుడుదీనుల మధ్యనివసించును

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 10
  • 1 min read

తేనెధారలు చదువుము : యెషయా 57:14-16



ఎ... నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను విషయము గలవారి యొద్దను, నలిగినవారి యొద్దను... నివసించుచున్నాను”

- యెషయా 57:15


మహాఘనుడును, మహోన్నతుడును, పరిశుద్దుడును, నిత్య నివాసియునైన దేవుడు సమస్త మానవాళితో సవా సమస్తమును సృష్టించి, కాపాడుచున్న సర్వాధికారియెన వాడైనను వినయము గలవారి యొద్దను, నలిగినవారి మధ్యను, దుష్టత్వమును విడిచి ఆయన ఎదుట తనను తాను తగ్గించుకొనినవారితోను నివసించును. ఆకాశమందు నక్షత్రాలను, ఈ లోకమును ఉనికిలోనికి తెచ్చి ఆ దేవుడే మన మధ్య నివసించును. అంత మహోన్నతుడైన దేవుడు మన న్థాయికి దిగి మనతో నివసించుటకు కోరుకొనెను. కాలానికి, స్థలానికి మించి జీవించు నిత్యుడైన దెవుడైనను నలిగిన హృదయము గలవారికి మరియు ఆయన నామమును ఘనపరచు వారికి సమీపముగా ఉండి వారికి చెవియొగ్వను. ఆకలిగొనిన వారికి తృప్పిపరచునునని, దు:ఖీంచువారిని ఆదరించుదునని ఆయన వాగ్భానమిచ్చుచున్నాడు. ఎంత అద్భుతము ! ఇది మనకును [గ్రహింపనాశ్చర్యముగా లేదా!


(ప్రియ స్నేహితులారా, ఆయన చేసిన ఈ గొప్పు సృష్టిలో మనమెంత అల్పులమో, అయినను ఆయన మనలనెంతగా లక్ష్యముంచుచున్నాడో గుర్తించినప్పుడు దిగ్ర్భాంతి కలుగక మానదు. అయినను ఆయన మనము గ్రహించలేని విధముగా మనలను లక్ష్యముంచును. అది ఆయన కొరకు కాదు గానీ మనకొరకే. ఆయన మన ఆత్మలను, హృదయాలను ఉజ్జీవింపజేయును. అయితే ఒక్క విషయము మనము గుర్తుంచుకొనవలసిన అవసరమున్నది. మనమాయన సన్నిధి ననుభవించవలెనంటే నలిగిన హృదయము గలవారమై యుండవలెను. దేవుడు తన ఎదుట తగ్గించుకొనువారికి తన (ప్రమ, మంచితనమును చూపవలెనని ఆశించును. గనుక మనము మోకరించి ప్రార్ధనలో ఆయనను ఘనపరచుచు ఆరాధించుదము. అన్నిటికంటె ప్రాముఖ్యముగా దేవుని ఎదుటను మనష్యుల ఎదుటను వినయము కలిగియుందము. 

ప్రార్ధన :- ప్రియప్రభువా, నా హృదయంలో గర్వపు ఛాయలున్నవి. మరింతగా వినయముగా ఉండుటకు దయతో సహాయము చేయుము. ఏ విధముగాను నన్ను నేను హెచ్చించుకొనక ఆత్మలో దీనత్వము కలిగి ఎల్లప్పుడు నీతోనే ఉండుటకు కృపచూపుము. సమస్త పాపపు, గర్వపు, స్వార్ధపు స్వభావముల నుండి నన్ను విడిపించుమని యేసునామమున వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page