top of page

10, అక్టోబర్ 2024 గురువారము చదువుము : మత్తయి 25:31-46

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 10, 2024
  • 1 min read

తేనెధారలు

దయకలిగి చిన్న సహాయము చేయుము

‘‘... మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరి...’’

- మత్తయి 25:40

అవసరతలో ఉన్నవారి పట్ల మన ప్రతిస్పందనను బట్టి దేవుడు తీర్పు తీర్చునని ఒక పాఠము నేర్పించుటయే ఈ ఉపమానము చెప్పుటలో యేసుప్రభువు యొక్క ఉద్దేశము. మనకున్న తెలివి, అదృష్టము లేక పేరుప్రఖ్యాతులను బట్టి కాక ఇతరులకు చేసిన సహాయమును బట్టియే ఆయన తీర్పు ఉండును. మనమెలాంటి చేయవలసియున్నది ? మొదట చిన్న విషయాలలోను చేయు సాయము. దీనికి యేసు ఉదహరించిన విషయాలేవనగా ఆకలిగొనిన వారికి ఆహారమిచ్చుట, దప్పిగొనిన వారికి నీళ్ళిచ్చుట, పరదేశులను చేర్చుకొనుట, రోగులను పరామర్శించుటయు, చెరసాలలో ఉన్నవారిని చూడవెళ్ళు మొ॥ ఎవరైన చేయగలిగినవే. వేలకొలది రూపాయిలు ఇయ్యమని ఇక్కడ ఆయన చెప్పలేదు కానీ ప్రతి దినము మనకు తటిస్థంచువారికి కొద్దిపాటి సాయము చేయమనియే చెప్పుచున్నాడు. రెండవది, అనుకోకుండా, లెక్క చూచుకోకుండా అప్పటికప్పుడే చేయు సాయము. ఈ ఉపమానములో చెప్పబడినవారు వారు చేయు సాయము క్రీస్తుప్రభువుకు చేయుచున్నారని, కాబట్టి నిత్యమైన బహుమానము వారు పొందుదురని తెలియకయే చేసిరి. దానిని చేయకుండా వారిని వారు ఆపుకొన లేకపోయిరి. వారికున్న ప్రేమగల హృదయమును బట్టి అది వారి సహజమైన ప్రతిస్పందనjైు యున్నది. సాయం చేయని వారి వైఖరి ఎలా ఉండుననగా ‘‘అది యేసు అని తెలిసి ఉంటే ఎంతో సంతోషంగా సహాయం చేసి ఉండేవారము’’ అని. అది వారి మెప్పుకొరకో నలుగురికి తెలియవలెనని ప్రచారం జరుగుననియో అయితే అట్టి వారు ఖచ్చితంగా సహాయం చేసియుండేవారు కానీ అది యదార్థమైన, జాతిగల హృదయంతో చేసేది కాక వేషధారణతో చేయు సాయమైయుండును.



ప్రియ మిత్రులారా, ఈ ఉపమానంలో అవసరతలో ఉన్న వారికి చేసిన ఏ చిన్న సహాయమైనను తనకు చేసినట్లేనని, అలాగే చేయకుండా ఉన్నది కూడా తనకు చేయనట్లేయని యేసు చెప్పుచున్నాడు. కావున ప్రతిఫలమాశించకుండా ఇతరులకు దాతృత్వం కలిగి సాయము చేయుదము.


ప్రార్ధన:- కృపగల దేవా, దయగల, దాతృత్వము మరియు కనికరము గల హృదయమును నాకిమ్ము. నా చుట్టు అవసరతలో ఉన్నవారికి ఎట్టి ప్రతిఫలమాశింపక చిన్నసాయమైనను చేయు కృపనిమ్ము. కీర్తి, ప్రతిష్ఠల నాశింపక నా క్రియల ద్వారా నిన్ను మహిమపరచుచు నిన్ను సంతోషపరచునట్లు నాకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాఉ తండ్రీ. ఆమెన్.

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page