top of page

0౮6, ఆగష్టు 2025 బుధవారము || రేవుని వాక్యమును నమ్మి శత్రువుతో పోరాడుము, విజయము తథ్యము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 6
  • 1 min read

Updated: Aug 7


తేనెధారలు చదువుము : యెహోషువ 6:1-5



“అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను - *చూడుము, నేను యొరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను”

- యెహోషు 6:2


ధైర్యవంతుడు, హతసాక్షిర్రైన సిరియా దేశస్థుడునైన జాన్‌ (క్రిసోస్త్వవు అను బోధకుదేమన్నాడంటే, “యుద్ధము చేయకుండానే, పోరాదకుందడానే జయించి కిరీటము పొందుదునని నీవనుకొంటే” నీవొక బలహీనమైన సైనికుడివే. ఆయన అన్నది వాస్తవమే, ఎందుకనగా కైస్తవ జీవితములో మనకిష్టమున్నా, లేకున్నా యుద్దాలు, పోరాటాలు ఉంటాయి. మన విరోధులైన లోకము, శరిరము, అపవాది కలిసి మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా దేవుని పిల్లలకు విరోధంగా ఎడతెగక పోరాటాలు రేవుచుండును గనుక మనము క్రీస్తుప్రభువుతో స్థిరముగా నిలిచియుండకపోతే ఓడిపోవుదుము. ఈ దిన వాక్యభాగంలో దేవుడు, యెహోషువతో “నేను యొరికోను నీ చేతికి ఇస్తాను” అని చెప్పలేదు కానీ “ఇచ్చివేసియున్నాను” అని భూతకాలములో చెప్పినట్లున్నది. దేవుని ఉద్దేశంలో ముందే జరిగిపోయినది. అనగా యుద్ధము ఆరంభించకముందే ముగిసినది ! అని అర్థము. కనానీయులు గొప్ప శూరులు, యుద్ధ విద్యలు నేర్చినవారు, ఆయుధాలు గలవారు, కానీ యెహోషువ, అతని పక్షాన ఉన్నవారికి దేవుని సన్నిధి, శక్తి ఉండెను. గనుక ఆ కనానీయులు వారినేమియు భయపెట్టలేకపోయిరి. యెహోషువకు తోడ్రైయుందునని, నిన్ను విడువను, ఎడబాయనని దేవుడు వాగ్ధానము చేసియుండలేదా?(యెహోషువ 1:5)


ప్రియ మిత్రులారా, మన అనుదిన జీవితంలో మన విరోధులతో ఆత్మీయ పోరాటాలు నెదుర్శొనుచుందుము, కాబట్ట మన చుట్టు ఘోరమైన పరిస్థితులున్నను వాగ్దానాలను గట్టిగా చేపట్టు స్థిరమైన విశ్వాసము కలిగియుండుట ఎంతో ప్రాముఖ్యమైయున్నది. ఆటంకాలు ఎంత 'పెద్దవైనను, విరోధులెంత బలవంతులైనను, దేవుని నుండి మనము శక్తి పొందినవారమైతే మనము జయము పొందగలము. వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చుటకు శక్తిమంతుడని మనము నమ్మవలసిన అవసరమున్నది (రోమా 4:21). మనము ఓడింపబడుటకు యేసుప్రభువు మనలను రక్షింపలేదు కానీ జయించుటకే గనుక దానిని సాధించుటకు తన మహిమార్ధము ఆయన ఎల్లప్పుడు సాయం చేయుటకు మనతో ఉండును. మీరు శ్రమలలో ఉన్నారా ? అయితే విజయం కూడా మీదేయని నిశ్చయతతో ఉండుడి.

ప్రార్దన :- ప్రియ ప్రభువా, తరుచుగా నేను అపవాది దాడిని ఎదుర్కొనుచున్నాను. నా ఆత్మీయ జీవితంలో వర్దిల్లకుండా ప్రాకారములు గల పట్టణాలు, బలవంతులైన శత్రువులు నాకు అడ్డు నిలుచుచున్నవి. కానీ నీవు ముందుగానే నా పక్షాన యుద్దములో గెలిచి విజయం సాధించితివి. గనుక గట్టి నమ్మికతోను, నీ వాక్యమునందు విశ్వసించి, నీ సన్నిధిపై ఆధారపడు కృపనిమ్మని యేసు నామమున ప్రార్దించుచున్నాను తండ్రీ, ఆమెన్‌ .

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page