09, జూన్ 2025 సోమవారము || నీ శత్రువులను క్షమించుటకు తీర్మానించుకొనుము
- Honey Drops for Every Soul

- Jun 9
- 1 min read
తేనెధారలు చదువుము : లూకా 6:27-36
‘... మీ శత్రువులను ప్రేమించుడి...’’ - లూకా 6:27
ప్రభుయేసు చెప్పిన విషయాలలో అత్యంత కష్టమైనది. ఇదియే కావచ్చు. మన శత్రువుల విషయంలో మనకు మూడు అవకాశాలున్నవి. వారిని తిరిగి బాధించవచ్చు, మనకు వారివలన కలిగిన బాధను మనలోనే ఉంచుకొని, ద్వేషము, పగను పెంచి పోషించుకొనుట తప్ప మరేమియు చేయలేము. లేదా ‘‘మీ శత్రువులను ప్రేమించుడి’’ అని ప్రభువిచ్చిన ఆజ్ఞను పాటించవచ్చు. మన శత్రువులను మనమెలా ప్రేమించదుము? మన మానవశక్తితో ఖచ్చితంగా అలా చేయలేము. కానీ, పరిశుద్ధాత్మ శక్తితోనే మనమలాగు చేయగలము. దీనికి కొన్ని సలహాలు లోవెల్ జాన్సన్‌గారు మనకు ఇచ్చిరి. మొదటిది, వారికి మేలు చేయుడి.’’ ఈ వాక్యభాగములో ‘‘మీ శత్రువులను ప్రేమించుడి’’ అనియు ‘‘వారికి మేలుచేయుడి’’ అనియు రెండుసార్లు యేసు చెప్పుట ఎంతో ఆసక్తి కలిగించుచున్నది. మనమే మొదట స్పందించి వారికేది మేలో అది చేయవలెను. రెండవది, ‘‘వారిని గూర్చి చెడుగా మాట్లాడుటను’’ ఆపివేయవలెను. మనకెవరో చెడు చేసిరని చెప్పు ప్రతిసారి మనలో పగ, ద్వేషము పెరుగుచుండును. మన బాధను గూర్చి ఎంత ఎక్కువగా మనము మాట్లాడుచు ఉంటే అంతగా మనకు క్షమించుట కష్టతరమగును. మూడవది, ‘‘వారి గురించి దేవునికి కృతజ్ఞతలు చెప్పుము’’. దేవుని చిత్తప్రకారము అనుమతితోనే మనపైకి శత్రువు పంపబడెనని మనము విశ్వసించవలసిన అవసరమైయున్నది. మనకు తెలియక పోవచ్చు కానీ మన శత్రువు మనకు దేవుని నుండి పంపబడిన బహుమానమే. మనము మోకరించి ప్రార్థించునట్లు చేసి, పరోక్షముగా మనము దేవునికి మరింత సన్నిహితంగా ఉండునట్లు వారు చేయుదురు. మనము తగ్గిచుకొనునట్లును చేయుదురు. నాల్గవది, ‘‘వారి కొరకు ప్రార్థించుము. మనము వారికొరకు ప్రార్థించుచుండగా దేవుడు వారిని మార్చవచ్చు. అన్నిటిని మించి, క్రీస్తు స్వరూపములోనికి మనము మార్చబడుదుము.
ప్రియ స్నేహితులారా, క్షమించుట అనునది ఒక్కసారి జరుగు సంఘటన కాదు, అది ఒక ప్రక్రియ. దానిని చేయుటకు సమయము పట్టును. అయితే మనము క్షమించినప్పుడు మన ఫలము గొప్పదగును. కోపము, ద్వేషము నుండి అది మనలను విడిపించును. మనకు మనశ్శాంతి కలుగును. మరి ముఖ్యముగా మనము మహోన్నతుడైన దేవుని పిల్లలమగుదుము. కావున క్షమించుటకు తీర్మానించుకొనెదముప్రార్ధన:- పరమ తండ్రీ, శత్రువును ప్రేమించుమను ఆజ్ఞనట్లయితే తిరగబడవలెనని నేననుకొందును. నా శత్రువులను క్షమించుటకు, వారికి మేలుచేయుటకు, వారిని దీవించి, వారి కొరకు ప్రార్థించుటకు నీ పరిశుద్ధాత్మ శక్తినిమ్ము. క్షమించుచుండగా క్రీస్తు పోలికలోనికి మార్చబడునట్లు నా హృదయమును మార్చుమని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments