top of page

09, ఏప్రిల్‌ 2025 బుధవారము || దేవుడు శాపమును ఆశీర్వాదముగా మార్చును

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Apr 9
  • 1 min read

తేనెధారలు చదువుము : హోషేయ 2:1-15


‘‘అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లునిత్తును. ఆకోరు (శ్రమగల) లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను...’’ - హోషేయ 2:15


ఆకోరు లోయ అనగానేమి ? యెహోషువ 7లో చెప్పినట్లు అది శ్రమగల లోయ. యెహోషువ మనుష్యులు హాయి పట్టణము మీదికి వెళ్ళినప్పుడు వారి చేతిలో ఓడిపోయిరి. ఇది వినిన యెహోషువ తన వస్త్రాలను చింపుకొని దేవుని మందసము ఎదుట పడినప్పుడు కర్మీ కుమారుడైన ఆకాను దేవుని ఆజ్ఞలకు అవిధేయుడై, విశ్వాసఘాతుకమైన పని చేసెను. అతడు బబులోను నుండి ఒక మంచి వస్త్రమును, రెండు వందల షెకలుల వెండి నాణెములు, ఒక బంగారు కమ్మిని దొంగిలించెను. ఇది దేవుని దృష్టికి హేయమైనది గనుక అతడు రాళ్ళతో కొట్టబడి చంపబడవలెనని ఆయన ఆజ్ఞాపించెను ! ఆ ప్రకారమే యెహోషువ ఆకానును, అతనికి చెందిన వాటినన్నిటిని ఆ ఆకోరు లోయలో పడవేసి ఇశ్రాయేలీయులందరు కలిసి రాళ్లతో కొట్టి పైన కప్పుగా వేసిరి. అప్పటినుండి ఈ లోయ ఆకోరు లోయగా పిలువబడినది. కానీ, చాలా సం॥లు అయిన పిదప ఆ శాపగ్రస్తమైన, శ్రమగల, ఆ ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా మార్చుదునని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా వాగ్ధానము చేసెను. ఈజిప్టునుండి వెలుపలకు వచ్చినప్పటివలె మునుపు పాడినట్లే ఇశ్రాయేలీయులు తిరిగి పాడుదురు అనియు ప్రకటించెను. వారంతా విశ్వాసఘాతకులైనను దేవుడు వారికి ఎందుకు ఆశీర్వాదమును వాగ్ధానము చేసెను? ఎందుకంటే, మన ప్రభువు ప్రేమ, కనికరము గలవాడు, ఆయన ఎన్నటికి తన పిల్లలను త్రోసివేయడు.


ప్రియ స్నేహితులారా, మీ భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ అంతయు కోల్పోతిరా ? మీరు అపరాధభావములో ఉన్నారా ? దేవుని వద్దకు వచ్చి మీ గత పాపములను ఒప్పుకొనుడి. మీరు పశ్చాత్తాపపడితే ప్రభువు దయాదాక్షిణ్యముగలవాడు గనుక మీ జీవితంలో ఒక నిరీక్షణ ద్వారమును తెరచును.
ప్రార్ధన:- పరమ తండ్రీ, నీ ఆజ్ఞలకవిధేయుడనై నమ్మకద్రోహముగా ప్రవర్తించితిని, దయతో నన్ను క్షమించుము. నా దు:ఖము, పాపమును తొలగించుము. నీవే నా నిరీక్షణ. నీవు నన్నెడును విడనాడక నీవద్దకు నేను వచ్చినప్పుడెల్ల నీ దయ నాకు చూపుదువని నేనెరుగుదును అని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page