top of page

08, ఏప్రిల్‌ 2025 మంగళవారము || గుణవతిjైున స్త్రీ నుండి నేర్చుకొనవలసిన పాఠాలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Apr 8
  • 1 min read

తేనెధారలు చదువుము : సామె 31:10-27


‘‘తన యింటివారికి చలి తగులునని భయపడదు, ఆమె యింటివారందరు రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు’’ - సామె 31:21


గుణవతిjైున స్త్రీని గూర్చి సామె 31లో మనము చదువుదుము. 21 వచనము. చలికాలమందు తనకు, తన ఇంటివారికి వెచ్చదనమిచ్చు ఉన్ని వస్త్రాలు ఆమె ముందుగానే సిద్ధపరచుకొనియుంచుకొనును గనుక వారికి చలి తగులునని భయపడదు. రాబోవు కష్టకాలముల కొరకు మనము సిద్ధపడియుండవలెనని ఆమె మనకు సూచనలిచ్చుచున్నది గనుక అవి వచ్చినప్పుడు మనము భయపడవలసిన అవసరము లేదు ! అయితే అది ఎలా?


మొదటగా, మనలను మనము ఆత్మీయంగా సిద్ధపరచుకొనవలెను. కష్టకాలములలో మన విశ్వాసము పరీక్షింపబడును గనుక దానిని బలపరచుకొనుటకు ఏకైక మార్గము దేవుని వాక్యము చేతనే. రెండవదిగా, మానసికంగా కూడా మనము సిద్ధపడవలెను. ప్రతి ఒక్కరి జీవితంలో ఆగ్రహము, అసూయ, శరీరాశ, జీవపుడంబము మొ॥ ఏదో ఒక బలహీనత ఉండును. మనలో ఏది ఉన్నదో గుర్తించి వాటిని ఒప్పుకొని, దేవునికి అప్పగించి సరిచేయుమని దేవుని సహాయము చేయుమని అడగవలెను. మానసికముగా బలముగా ఉండి, సిద్ధపడి ఉన్నప్పుడు జీవిత అవరోధాలను అధిగమించుటకు మరెక్కువ సామర్థ్యం కలిగియుందుము. మూడవదిగా, భౌతికముగా కూడా మనము సిద్ధపడియుండవలెను. ఒత్తిడిని తట్టుకొనునట్లు సమతుల ఆహారము మరియు వ్యాయామము చేసి మన దేహమును మంచి స్థితిలో ఉంచుకొనవలెను. చివరిగా, మనము ఆర్థికముగాను సిద్ధపరచుకొని యుండవలెను. ఈ దినమును గూర్చియే మనము అనేకసార్లు ఆలోచించుచుందుము. ఊహించని ఖర్చులకు అవసరమైన ధనమును అనుదినము కొంత పొదుపు చేసి ఉంచుకొనుట ఎంతో తెలివైన పని.


ప్రియ మిత్రులారా, మన జీవితయానములో తుపానులెదురైనప్పుడు పైన చెప్పిన విధంగా సిద్ధపడి ఉంటే ఖచ్చితంగా మన ఓడ బ్రద్దలైనట్లు ఉండము.
ప్రార్ధన:- ప్రేమగల తండ్రీ, కష్ట సమయాలలో నన్ను సిద్ధపరచుకొనునట్లు నాకు వివేకమిమ్ము. నేనెట్టి పరిస్థితిలోను కదలింపబడకుండా నీ వాక్యమును స్థిరమైన పునాది మీద నిలిచియుండునట్లు నీ వాక్యమందు నమ్మికయుంచు కృపనిమ్ము. ఆత్మీయంగాను, భౌతికంగాను, ఆర్థికముగాను, మానసికముగాను నన్ను బలపరచుమని యేసు నామమున కృతజ్ఞతలు తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Kommentare

Mit 0 von 5 Sternen bewertet.
Kommentare konnten nicht geladen werden
Es gab ein technisches Problem. Verbinde dich erneut oder aktualisiere die Seite.
bottom of page