07, మార్చి 2025 శుక్రవారము || శనివారము
- Honey Drops for Every Soul

- Mar 7
- 2 min read
చదువుము : మార్కు 12:41-43
రెండు మైళ్ళు నడచువారిగా ఉండుడి
‘‘ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన యెడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము’’- మత్తయి 5:41
మంచి క్రీముతో అలంకరింపబడిన ఒక చాకొలెట్ కేకు చూచుటకెంతో బాగుండును. దాని మీద ఎర్రని చెర్రీలు పెట్టినప్పుడు అది ఇంకను అద్భుతంగా ఉండును. ‘‘రెండు మైళ్ళు నడుచు వానిని చూచినప్పుడు దేవుని దృష్టిలో అతడును అంతే అద్భుతంగా కనబడును ! అనగా అతడు ఇతరుల కొరకు ఇంకొక మైలు లేక మైళ్ళు వెళ్ళువాడు. నిజానికతడు మరింత శక్తినుపయోగించును గనుక అది ఆ చెర్రీ పెట్టిన కేకు వలెనే ఉండును. అతని నుండి ఆశించిన దానితోనే సరిపెట్టుకొనక మరి కొంచెము అదనంగా కష్టపడును గనుక అది నూటికి నూరు శాతము విభిన్నముగా ఉండును.
ఆ చెర్రీని పెట్టినట్లుగా ‘‘రెండు మైళ్ళు నడచిన’’ వారనేకులను బైబిలునందు మనము చూడగలము. తరువాత, లూకా 10 వ.లో మంచి సమరయుని గూర్చి మనము చదువుదుము. మార్గములో గాయాలతో పడియున్న వ్యక్తిని అతడు చూచినప్పుడు అతని గాయములు కట్టి, నూనె, ద్రాక్షారసము పోసి, అతడిని ఒక సత్రమునకు కొనిపోయి ఆ సత్ర యజమాని వద్ద ఉంచి అతనిని పరామర్శించుమని కొంచెము ధనము చెల్లించి, అంతేకాక ఆ గాయపడిన యాత్రికుని అతడేమైన అదనంగా ఖర్చు చేసినట్లయితే దానిని తానే తిరిగి చెల్లింతునని వాగ్ధానము చేసెను !
ప్రియ మిత్రులారా, మన కొరకు తన ప్రియ కుమారుడైన క్రీస్తు యేసును మరణించుటకు పంపుట ద్వారా మన పరమ తండ్రి మన కొరకు అదనంగా మరొక్క మైలు నడుచుట నిజము కాదా ? దానికి మనము పాత్రలము కాము. అయినప్పటికి ఆయన మనలనెంతో ప్రేమించెను గనుక దానిని చేసెను. మనమాయన పోలికగా చేయబడితిమి గనుక మనము కూడా రెండవ మైలు నడుచుచు జీవించుదము. మనము ప్రయాణించుచు భౌతికంగాను, మానసికముగాను, ఆర్థికంగాను అవసరతలో ఉన్నవారికి సహాయము చేయుటకు ఇష్టపడుదము. ఇతరుల సమస్యల నుండి లేవనెత్తుటకు మన సమయము, సుఖసౌఖ్యాలను త్యాగము చేయ సిద్ధపడుదము, అలా చేయుట ద్వారా ఇతరులకు దేవుని ప్రేమను చూపించుదము.ప్రార్ధన:- ప్రియమైన తండ్రీ, రెండు మైళ్ళు నడచుటకు అనగా అదనంగా చేయుటకు మరింత త్యాగము చేయవలెనని ఎరిగి, కానీ పైన చెర్రీ పండ్లతో అలంకరింపబడునట్లు అదనపు అంతరంగ స్వభావము కలిగియుండవలెను గనుక మరి కొంచెము కష్టపడి ఇతరుల జీవితాలలో వంద శాతము మార్పు కలిగించుటకు నాకు నీ కృపననుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments