top of page

07, జూన్ 2025 శనివారము || మనీమీ దినము దేనిని ఎక్కువగా కోరుచున్నాము ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jun 7
  • 1 min read

తేనెధారలు చదువుము :2 రాజులు 2:1-12



‘‘ఎలీషా... నీకు కలిగిన ఆత్మలో రెండుపాళ్ళు నా మీదికి వచ్చునట్లు దయచేయమనెను’’ - 2 రాజులు 2:9


ఎలీషా కొంతకాలము నుండి ఏలియాను వెంబడిరచుచు అతనివద్ద నేర్చుకొనుచుండెను. ఏలియా దేవుని చేత కొనిపోబడు సమయమొచ్చినప్పుడు ఎలీషా ఏమి కోరినను ఇచ్చెదనని ఏలియా చెప్పెను. సొలొమోను రాజైనప్పుడు అతడు సంపదనైనను, ఘనతనైనను, దీర్ఘాయువునైనను అడుగక వివేకము, తెలివిగల హృదయమిమ్మని అడిగినట్లు ఎలీషా కూడా ఏది ప్రాముఖ్యమైనదో ఎరిగియుండి, ఏలియాకు కలిగిన ఆత్మ తనకు అవసరమనుకొనెను. ఏలియా ఆత్మ అనగా ఏమిటి ? అది నమ్మకముగా బాధ్యత నెరవేర్చు ఆత్మ, పాపమును గద్దించు ఖచ్చితమైన ఆత్మ, అది పిరికితనములేని అపాయము వచ్చినను ధైర్యము కలిగియుండి, అదే విధముగా సాత్వికము, ప్రేమ గల ఆత్మjైుయున్నది. ఏలియా ఆత్మ సంపూర్ణముగా పరిచర్య చేయు, దేవునికి సమర్పించుకొనిన ఆత్మ. ఆ కాలములో జ్యేష్ఠ కుమారుడు తన తండ్రి ఆస్తిలో రెండిరతలు పొందేవాడు. ఎలీషా కేవలము ఏలియాకు సేవకుడే కాదు కానీ అతడు ఏలియాకు జ్యేష్ఠ కుమారునిగా ఎంచబడవలెనని ఆశించెను. అతడు ఏలియా యొక్క వారసత్వముగా దేవుని పరిచర్య అతని కంటె మరింత శక్తితోను, అభిషేకముతోను చేయవలెనని కోరుకొనెను.


ప్రియ స్నేహితులారా, అనేకమంది తాత్కాలికమైన ధనము, ఇల్లు, కార్లు మొ॥గు ఇహపరమైనవే కోరుచుందురు. ఆత్మసంబంధమైన ఆశీర్వాదమును కోరుటయే అన్నిటికంటే గొప్పదైయున్నది. దేవునిపట్ల నమ్మకము, సమర్పణను అది చూపుచున్నది. దేవునియందు మనకున్న నమ్మకమును చూపును. మనం కోరుకొనువాటికంటే మరెక్కువగా దేవుడు మనలను వాడుకొనునట్లు చేయును. ఈ దినము మనమేమి కోరుచున్నాము ? దేవుడు మనకు రెట్టింపుగా ఆత్మీయ ఆశీర్వాదాలననుగ్రహించును. విశ్వాసముతోను, అత్యాసక్తితోను, పట్టుదలతోను వేడుకొనుటయే దేవుడు మననుండి కోరునది. దేవుడు పక్షపాతి కాడు. కావున ఆత్మవరాలను అత్యాసక్తితో కోరుకొని దేవుని చేత ఏర్పరచబడిన సాధనాలుగా ఉందము.

ప్రార్థన : ప్రియ ప్రభువా, ఈ లోక సంపద కంటె ఎక్కువగా ఆత్మీయ ఆశీర్వాదాల కొరకు నేనాశించు కృపనిమ్ము. భయము లేకుండగనరు, నమ్మకముగాను, మరింత శక్తి, జ్ఞానముతోను నిన్ను సేవించునట్లు రెండంతలుగా నీ ఆత్మను నాపై కుమ్మరించుమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page