top of page

07, అక్టోబరు 2025 మంగళవారము || విగ్రహాలను విడిచిపెట్టుము ! దేవునికే మహిమనిమ్ము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 7
  • 2 min read

తేనెధారలు చదువుము : యెహెజ్కేలు 8:1-18


‘‘... నేను ఉత్తరపు వైపు తేరి చూచితిని, ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి ఈ విగ్రహము కనబడెను’’ - యెహెజ్కేలు 8:5


యెహెజ్కేలు కాలానికి వెయ్యి సం॥లకు ముందు జీవించిన మనష్షే ఇశ్రాయేలు చరిత్రలో చెడ్డ రాజులలో ఒకడు. ‘‘ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని’’ దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును దేవుడు చెప్పిన ఆ మందిరములో మనష్షే తాను చేయించిన ఆషేరా ప్రతిమను ఉంచెను (1 రాజులు 21:7). ఆ తరువాత రాజైన యోషియా 2 రాజులు 23:6లో వ్రాయబడిన విధముగా ‘‘యెహోవా మందిరమందున్న ఆషేరా ప్రతిమను యెరూషలేము వెలుపలనున్న కిద్రోను వాగు దగ్గరకు తెప్పించి, దాని ఒడ్డున దానిని కాల్చి, త్రొక్కి పొడుము చేసి, ఆ పొడుమును...’’ ‘‘ఏలయనగా నేను రోషము గల దేవుడను, గనుక పైన ఆకాశమందే గానీ, క్రింది భూమియందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గానీ యుండు దేని రూపమునైనను, విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు’’ అని దేవుడు ఇశ్రాయేలీయుల నాజ్ఞాపించెను. (నిర్గ.కాం. 20:5). ‘‘వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామమున రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు’’ అని ఇశ్రాయేలుకు చెప్పబడినది. (నిర్గ.కాం. 34:14). ఇక్కడ ఆయన నామము రోషము గలది అనగా, యెహోవా - ఖ్వన్నా. తనకు రావలసిన ఘనతను దేవుడు వేరొకరితో పంచుకొనడని ఇక్కడ నొక్కి చెప్పబడినది. ‘‘వారాయన సొత్తు’’. ఆయనయే నిజమైన దేవుడు గనుక కేవలము ‘‘పెదవులతో ఘనపరచక’’ మన బ్రదుకులు, ప్రవర్తన, నడవడి, సమస్తముతో మనమాయనను ఘనపరచవలసియున్నది.


 ప్రియ మిత్రులారా, మన జీవితంలో మరే విగ్రహానికిjైునను ఘనత ఇయ్యకుండా జాగ్రత్త పడుదము. నిజముగానే చెక్కిన ఒక ప్రతిమకు సాగిలపడి, పూజింపకున్నను మన జీవితంలోను, హృదయంలోను ‘‘ఘరానా విగ్రహాలు’’ ఉండియుండవచ్చు. విగ్రహానికి ‘‘ఏ వ్యక్తి లేక ఏ వస్తువుకైనను గ్రుడ్డిగా ఘనత, ఇష్టము కలుగజేసికొనుట’’ అని నిర్వచనము ఇయ్యబడినది. మన జీవితంలో మన ఉద్యోగము లేక విద్య పేరు ప్రతిష్ఠలు లేదా విలాసవంతమైన జీవిత విధానమో దేనిని మనమెక్కువగా ఘనపరచుచున్నాము ? ‘‘దీనిని తొలగించినట్లయితే నేనింకను దేవుని ప్రేమించి, నమ్మకముగా ఆయన ననుసరించు చున్నామా? అని మనలను మనము ప్రశ్నించుకొందము.

ప్రార్ధన:- ప్రియప్రభువా, ఏ విగ్రహమునైనను చేసికొని, దానినారాధించకయు, మరి దేనికైనను ఘనత నియ్యకయు జాగ్రత్తపడి, జీవపుడంబమును, ధనము, విద్యను హెచ్చించకయు, అవి నీపై నుండి నా దృష్టిని మరల్చనియ్యకయు, నేను నీ స్వాస్థ్యమును గనుక నీవు రోషము గల దేవుడవని, భక్తి కలిగి నిన్నే ఆరాధించి ఘనపరచు భాగ్యమిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.  

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page