top of page

07, అక్టోబర్ 2024 సోమవారం చదువుము : 1 కొరింథీ 9:24-27

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 7, 2024
  • 1 min read

తేనెధారలు


పరిగెత్తుము ! పందెమును ముగించుము ! బహుమానము పొందుము !



‘‘పందెపు రంగమందు పరుగెత్తువారందరు గానీ యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా?’’ (1 కొరింథీ 9:24)


ఒలింపిక్ పరుగు పందెములో సారూప్యతను ఇక్కడ పౌలు చూపుచున్నాడు. దీనిలో పరుగెత్తు వారిలో ఒక్కరికే ‘‘మొదటి బహుమతి’’ పొందుదురు కానీ రన్నర్స్ ఎవరు ఉండరు గనుక పరుగెత్తువారు ప్రతి ఒక్కరితోను పోటీపడి పరుగెత్తుదురు. ‘‘పందెము’’ అను మాటకు గ్రీకు పదము ‘‘ఏగన్’’ ఇది ‘‘యాగసీ’’ అను మాట నుండి తీసికొనబడినది. పందెమనునది నిమగ్నమగుటయో లేక విలాసము కొరకో కాదు గానీ కొన్నిసార్లు ఇది ఒక కఠోరమైన, వేదనాభరితమైనదిగా ఉండి మన ఖచ్చితమైన క్రమశిక్షణను, దృఢ నిశ్చయతను, పట్టుదలను కలిగియుండవలసిన పని. క్రైస్తవులమైన మనమును పందెపు రంగంలో పరుగెత్తుచున్నాము. అయితే ఇక్కడ ఉన్న తేడా ఏమనగా ఈ క్రైస్తవ పందెంలో పరుగెత్తు ప్రతి ఒక్కరికి బహుమానమున్నది. మనలో ప్రతి ఒక్కరు పరుగెత్తుటకు ఎవరి ‘‘దారి’’ వారికి ఉండి, ఎవరితోను పోటీపడునది కాదు. మనము మనతోనే పోటీపడు చుందుము, ప్రత్యేకించి ఈ లోకము, శరీరము, అపవాదితో నిరంతరము ప్రయాసపడి పరుగెత్తుచున్నాము. ‘‘పరుగు’’ అనేది వర్తమాన కాలమును సూచించుచు ఇది ఒక జీవితకాల పోరాటము అను సత్యమును తెలియజేయుచున్నది.



ప్రియ మిత్రులారా, క్రైస్తవ జీవితము ఎవరు మొదటి బహుమతి పొందుదురో అని చూచునది కాదు కానీ ఎవరు ఈ పరుగును నమ్మకముగా ముగించుదురో అని చూచు ఓర్పును పరీక్షించునదైయున్నది. ఈ పరుగును ఎప్పుడు ఆరంభించితిమో, ఎలా ఆరంభించితిమోయని కాకుండా ఎలా ముగించితిమోయని దేవుని చేత తీర్పు తీర్చబడుదుము. కొందరు క్రైస్తవులు పందెపు ఆరంభంలో యదార్థంగానే పరుగెత్తుదురు, కొందరు సగము వరకు చక్కగానే పరుగెత్తుదురు, కానీ మంచి పోరాటము పోరాడి చక్కగా ముగించిన వారే ధన్యులు. కావున నడుచుచు, ఆగిపోవును, కూర్చొండుట కాక పరుగెత్తుదము. ఎందుకంటే గెలుచుటకు అది ఒక్కటే మార్గము. మనమొకవేళ ఆలస్యం చేయవచ్చు లేక మార్గములో తడబడవచ్చు కానీ మనము బాగుగా ముగించవలసియున్నది. దీని రహస్యమేమంటే తుది క్షణము వరకు క్రీస్తుప్రభువుకు నమ్మకముగా నిలిచి యుండుటయే.



ప్రార్ధన :- ప్రియ ప్రభువా, నీవు నా ఎదుట ఉంచిన పరుగు పందెములో పరుగెత్తు కృపనిమ్ము. నేనొకవేళ నిదానంగానో, మార్గ మధ్యలో తడబడినను, ఆగకుండా సాగిపోవుచు, ప్రయాసపడి, రోషముతో, యదార్థంగాను, పట్టుదలతోను పరుగెత్తి బహుమతి పొందునట్లునను నీ శక్తితో బలపరచుమని కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ. ఆమెన్.

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonlin

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page