top of page

06, జూలై 2025 ఆదివారము || దేవుడు తన వాగ్ధానాలు నెరవేర్చును - నమ్మి వేచియుండుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 7
  • 1 min read

తేనెధారలు చదువుము : ఆది కాం. 21:1-7



‘‘మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను. అప్పుడు నీ భార్యjైున శారాకు ఒక కుమారుడు కలుగును’’ - ఆది.కాం. 18:10

ఇస్సాకు జననము ద్వారా అబ్రహాము కొన్ని విషయాలు గ్రహించెను. మొదటిది, దేవుడు తాను ఇచ్చిన మాటను తప్పక నెరవేర్చునని. ఆది కాం. 21:1 చెప్పుచున్నదేమనగా, ‘‘దేవుడు తాను చెప్పినట్లు శారా పట్ల కృప చూపెను. మరియు ఆయన శారాకిచ్చిన వాగ్ధానము నెరవేర్చెను’’. సర్వశక్తిగల దేవుడు అబద్దమాడుట అసాధ్యము అని అబ్రహాము తెలిసికొనెను. రెండవది, దేవుని సమయమెప్పుడును ఖచ్చితమైనది. కల్దీయుల ఊరు అను ప్రదేశంలో దాదాపుగా 25 సం॥ల క్రితము దేవుడు అబ్రాహాముతో మొదట మాట్లాడియుండెను. ఆ కాలమందు అబ్రహాము అనేకమైన ఆత్మీయ ఎత్తు పల్లాలను చవిచూసెను. దేవునియందు అతడెంతో విశ్వసించియుండినను కొన్నిసార్లు సందేహించెను. కానీ, మరొకసారి దేవుడతనికి ప్రత్యక్షమై తానిచ్చిన వాగ్ధానమును గుర్తుచేసి ధైర్యపరచెను. మూడవది, దేవుని శక్తి అపరిమితమైనదని అబ్రహాము తెలిసికొనెను. ఇస్సాకు అద్భుతమైన బిడ్డ ఎందుకనగా అప్పటికే శారా గర్భము ఉడిగిపోయియుండెను’’. ఒక సం॥ క్రితము ఆమెకు ఒక కుమారుడు కలుగునని దేవుడామెకు చెప్పినప్పుడు ఆమె గర్భవతి అయ్యే అవకాశమే లేకుండెను. అది అసాధ్యమేయని శారా అనుకొనెను (ఆది. కాం. 18:12). అయితే దేవుడు తన శక్తిచేత మృతతుల్యమైన శారా గర్భమును తిరిగి పునరుజ్జీవింపజేసెను. చిన్ని ఇస్సాకును అబ్రహాము తన చేతులలోకి తీసికొనినప్పుడు దేవునికేదియు అసాధ్యము కాదని అతడు ఖచ్చితముగా తెలిసికొనెను.


ప్రియ మిత్రులారా, దేవుడు తానిచ్చిన మాట మీద నిలబడువాడని, కొన్నిసార్లు ఆయన ఆలస్యం చేయుచున్నాడని మనము మన ఆలోచన చొప్పున భావించినను ఆయన ఎల్లప్పుడు తగిన సమయమందే తప్పక సమస్తము జరిగించునని ఇస్సాకు జననము మనకు జ్ఞప్తికి తెచ్చును గాక. మన ఆలోచన చొప్పున పనిచేయుటకు ఆయన తొందర పడడు. మన ప్రార్థనలకు ఆయన జవాబులు ఆలస్యము చేసినప్పుడు మనమెన్నిసార్లు విసిగి వేసారితిమి ! దేవుడు తన వాగ్ధానము నెరవేర్చువరకు ఓపికతో కనిపెట్టుకొని యుండుట ఎంత మేలు ! మనమెంత కాలము వేచియుండవలసి వచ్చినను దేవుడు తన ఉద్దేశాలను నెరవేర్చుట కొరకు మనమాయనయందు నమ్మికయుంచుటయే ముఖ్యము.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, దీర్ఘకాలము నా ప్రార్థనకు జవాబు రానప్పుడు నీ వాగ్ధానాన్ని సందేహించుచుండును. అద్భుతమైన ఇస్సాకు జననము ఈ దినము నీవు సర్వశక్తిగల దేవుడవని తగిన సమయమందు నీ వాక్కును నీవు నెరవేర్చుదువని నాకు ధైర్యము కలిగినదని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page