top of page

06, జూన్ 2025 శుక్రవారము   || జయించుటకు అనేకుల అవసరము లేదు కానీ దేవుడే చాలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jun 6
  • 1 min read

తేనెధారలు చదువుము :1 సమూ 14:1-12



‘‘... అనేకుల చేతనైనను, కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా...’’ - 1 సమూ 14:6


ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు ఫిలిష్తీయుల సైన్యము రథములతోను, ఇనుప ఆయుధములతోను గొప్ప దండుగా మిక్మషులో దిగియుండిరి. సౌలు తన మనుష్యులతో దానిమ్మ చెట్టు క్రింద సేదదీరుచుండగా యోనాతాను అవతల ప్రక్క ఉన్న ఫిలిష్తీయులను హతము చేయుదము రమ్మని తన ఆయుధములు మోయువానితో కలసి వెళ్ళుటకు ధైర్యము చేసెను. అక్కడికి చేరుటకు సూది గట్టువంటి పర్వతము ఎక్కి వెళ్ళవలసియుండెను. అది ఎంతో ప్రయాసతో కూడినదైయుండెను. అయితే యోనాతాను తన ఆయుధములు మోయువానితో ‘‘ఈ సున్నతిలేనివారి దండు కాపరుల మీదికి పోదము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో. అనేకులు చేతనైనను, కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా’’ అని చెప్పెను. ‘‘దేవునికి అసాధ్యమైనదేదియు లేదు, ఆయనను ఆపగలదేదియు లేదు’’ అని చెప్పుటలో యోనాతాని వైఖరి కనబడుచున్నది. ఇది తండ్రి ఏలాగో కుమారుడు అలాగే అన్నట్లుగా ఇది లేదు. ఇదెంత విరుద్ధమైనదిగా కనబడుచున్నది. తండ్రిగా సౌలు భయపడెను, అపనమ్మికతోను, వైఫల్యము చెందినవాడుగా ఉండెను. కానీ, కుమారుడైన యోనాతాను మాత్రము ధైర్యవంతుడుగాను, మంచి విశ్వాసముతోను, విజయవంతుడుగా ఉండెను. విశ్వాసము పరిస్థితులను చూడదు కానీ, దేవునివైపే చూచును. దేవుడు తన ప్రజలను కాపాడుమని నమ్మి యోనాతాను ధైర్యముతో ఒక క్లిష్ట పరిస్థితి నెదుర్కొనెను. అతడు కనబడుచున్న పరిస్థితిని మించి తన విశ్వాసమును అగుపరచెను. యోనాతాను తనయందు తాను కొంచెము మట్టుకే విశ్వసించి, దేవునియందు గొప్ప విశ్వాసముంచెను. ‘‘దేవుని సహాయముతో నేను జయించగలనని’’ కాదు కానీ నా ద్వారా దేవుడు గొప్ప జయము సాధించును’’ అని.


ప్రియ మిత్రులారా, దేవునికి జయించుటకు ఎక్కువ మంది అవసరము లేదని, సంఖ్యతో పనిలేదని లేఖనాధారాలున్నవి. యుద్ధములు గెలుచుటకు దేవునికి ఎక్కువమందితో పనిలేదు. శ్రద్ధగా తన మాటననుసరించుటకు సిద్ధముగా ఉన్న కొద్దిమంది నమ్మకస్థుల కొరకు దేవుడు చూచును. దేవుని కొరకు విశ్వాసముతో ముందడుగు వేయుటకు మనము సిద్ధమేనా ?

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, యోనాతానుకు జయించుట అసాధ్యముగా ఉండినను, నీవతనితో అతని పక్షముగా ఉంటే ఎల్లప్పుడు జయమేనని అతడెరిగియుండెను. అతడు తన బలముపై కానీ, తనతో ఉన్నవారి సంఖ్యా బలముపై కానీ చూచి ఆధారపడలేదు కానీ నీయందే తన విశ్వాసము వేరుపారి యుండెను. నేనును నీ మీదనే ఆధారపడి, నీ శక్తితోనే శత్రువుతో పోరాడు కృపననుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page