05, మార్చి 2025 బుధవారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 5
- 1 min read
చదువుము : మత్తయి 4:1-11
భస్మ బుధవారము అపవాది నెదిరించుడి
‘‘అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను’’
- మత్తయి 4:1
ప్రభువైన యేసు ఎదుర్కొనినన శోధన నుండి మనము నిజమైన పాఠాలు నేర్చుకొనవచ్చు. మొదటిదిగా, సాతాను ఒక బలమైన శత్రువు అని తెలిసికొందుము. ప్రభువైన యేసు మీదనే దాడి చేయుటకు కూడా వాడు భయపడలేదు. దేవుని సొంత కుమారుని మూడుసార్లు శోధించెను. గనుక వాని పన్నాగాలకు వ్యతిరేకంగా మనము మెలకువ కలిగి అనుదినము ప్రార్థించుదము. మనమెన్నడు చూడని ఆ శత్రువు కంటె మరి చెడ్డ శత్రువు ఎవరు ఉండరు, కానీ వాడు మనకు సమీపముగానే, మనము వెళ్ళిన చోటుకెల్ల మనతోనే వచ్చుచుండును. మన శరీరేచ్ఛలను సిలువ వేయుటయే కాక అనుదినము ఈ లోకమును జయించుచు అపవాదిని ఎదిరించవలెననియు మనము గుర్తుపెట్టుకొనవలెను. రెండవదిగా, శోధన ఏదో వింతగా మనము భావించరాదని గ్రహించుదుము. సాతాను క్రీస్తు ప్రభువు నొద్దకే వస్తే వాడు విశ్వాసులమైన మన వద్దకు కూడా వచ్చును. అగ్నిబాణాలతో వాడు మనపై దాడి చేయును. మన మనసులను అనుమానాలతోను, చెడ్డ తలంపులతోను వాడు రేపును వాని బలమును తక్కువ అంచనా వేయరాదు. వాని దాడులకు మనమాశ్చర్యపడకయుందము. మూడవదిగా, సాతాను నెదిరించుటకు మనము ఉపయోగించవలసిన ప్రధానమైన ఆయుధము బైబిలు అని మనము తెలిసికొందుము. ప్రభువును శోధింప ప్రయత్నించిన మూడుసార్లు కూడా లేఖనములోని వాక్యాలతోనే ‘‘ఇలా వ్రాయబడియున్నది’’ అని చెప్పి ఆయన వానిని అడ్డుకొనెను. ఆత్మఖడ్గమైన వాక్యమునుపయోగించకుండా అపవాదితో మనమెన్నడును పోరాడలేము. గనుక మనము తప్పక క్రమముగా బైబిలు చదివి, దానిని బట్టి ప్రార్థించి, ఆ వాక్యాలను మనము జ్ఞాపకముంచుకొనవలెను.
ప్రియ మిత్రులారా, మన రక్షకుడు తానే శోధింపబడి, శ్రమపడెను గనుక మనము శోధింపబడినప్పుడు ఆయన సహాయము చేయ సమర్థుడు. సమస్త శోధనలన్నిటి నుండి విడిపించుటకు ఆయన ఎల్లప్పుడు సిద్ధముగా ఉండును.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా,ఈ లెంటు కాల మొదటి దినాన ఎప్పటికంటె మరెక్కువగా నీ సమీపమునకు చేరు కృపనిమ్ము. నీ వాక్యమును మరెక్కువగా చదివి, ధ్యానించి సాతాను నోడిరచుటకు దానిని ఒక ఆయుధముగా వాడుటకు సాయం చేయుము. శోధన నెదిరించి అనుదినము విజయవంతంగా జీవించు కృపననుగ్రహించుమని యేసు నామమున వేడుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
תגובות