top of page

05, జులై 2025 శనివారము || నీ ఆలోచనల విషయము జాగ్రత్తపడుము !

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 5
  • 1 min read

తేనెధారలు చదువుము : యోహాను 21:15-19



‘‘నేను చేపలు పట్టబోదునని సీమోను పేతురు వారితో చెప్పగా... - యోహాను 21:3


తనను వెంబడిరచుమని పెతురును ప్రభుయేసు మునుపు పిలిచినది సముద్ర తీరాననే. అప్పుడు పేతురు యేసును వెంబడిరచుటకు సమస్తమును విడిచి పెట్టెను. ఆయన సిలువ వేతను గూర్చి మాట్లాడినప్పుడు అప్పుడు పేతురు ‘‘అంచంచలమైన’’ నమ్మకత్వమును వెల్లడిచేసెను. కానీ ఆ తరువాత అతడు ముమ్మారు యేసును తృణీకరించి మాట తప్పెను. ఇప్పుడు తిరిగి మునుపటి వలె చేపలు పట్టబోయెను ! తన పని, పరిచర్య పూర్తిగా ముగిసిపోయెనని రేతురు తలంచియుండవచ్చు. ప్రభువైన యేసు సీమోను పేతురును మరల పరిచర్యకు పూనుకొనుమని చెప్పినట్లు ఈ వచనాలలో మనము చూడగలము. కేవలము తిరిగి పేతురును సేవకు పిలుచుటకే యేసు తిబెరయ సముద్రము వద్దకు వచ్చియుండెను. అది యేసుకు సీమోను పేతురుకు మధ్య చక్కని సహవాస పునరుద్ధరణ సమయమైయుండెను. ఈ కొద్ది వచనాలలో పేతురు గతములో చేసిన అపరాధ భావము నుంచి విడిపించి తిరిగి ప్రభువు యొక్క మరియు ఆయన సంఘ పరిచర్యకు ఆయత్తపరచెను.

     

 ప్రియ స్నేహితులారా, మన ఆత్మీయ వైఫల్యతను పేతురుతో పోల్చుకొనవచ్చు. మన విశ్వాస ఒప్పకోలు, మరియు దేవుని పరిచర్యకు సమర్పించుకొని మనలో ఎందరు పాపములో పడి ఆత్మీయంగా ఫలించక ఉన్నాము ?  ఈ వాక్య భాగములో మనందరికి ఒక ధైర్యము కలిగించు విషయమున్నది.  అదియే దేవుడు దయగలవాడు. పడిపోయిన వారిని ప్రయోజకులుగా చేయునది ఆయనే. ఆయన మన పాపాలను క్షమించుటయే కాదుగానీ తన మహిమార్ధము పరిచర్య చేయు స్ధానానికి లేవనెత్తును. మనమెంతగా పతనమైయున్నను యేసునందు మనకింకను మంచి మిత్రుడున్నాడు. ఎప్పటివలనే ఇప్పుడును ఆయన మనలను ప్రేమించుచున్నాడు. కావున ఇప్పుడే ఆయన వద్దకు రమ్ము. ఆయన చిత్తములోను పరిచర్యలోను జీవించునట్టి విధేయత కలిగిన జీవితమునే ప్రభువైన యేసు కోరుచున్నాడు. 

ప్రార్ధన :- ప్రియప్రభువా, నీకు విరోధముగా నేను పాపము చేసితిని. నేను చేయరాని కార్యాలు, నిన్ను దు:ఖపరుచును అని చెప్పి చేసితిని. దయగల దేవుడవు గనుక నన్ను క్షమించి నానింద అవమాన భారము నుండి నన్ను విడిపించుము. నూతనమైన తీర్మానములో మరొకసారి నిన్ను సేవించవలెనని యేసునామమున కోరుచు ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page