05, జూన్ 2025 గురువారము || నీ చిత్తము చేయ నేర్పుము ప్రభువా !
- Honey Drops for Every Soul

- Jun 5
- 1 min read
తేనెధారలు చదువుము :కొలస్సీ 1:1-9
‘‘మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మసంబంధమై వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారై... యుండవలెనని ప్రార్థించుచున్నాను’’ - కొలస్సీ 1:9
‘‘నింపబడుట’’ అను పదము ‘‘ప్లీరో’’ అను మాటగా అంచుల వరకు నింపుమని చెప్పుటjైుయున్నది. ఒక గ్లాసులో పైవరకు అంచు దాకా నీటిని పోయుట కంటే మరెక్కువ అర్థమును ఈ ప్లీరో అను మాట సూచించుచున్నది. వాటిలో కొన్ని అర్థాలు : మొదటిది, నీటిలో ఓడ బలముగా సాగిపోవుటకు తెరచాపలకు కొట్టు గాలికి ఈ ప్లీరో అను మాటను తరచుగా ఉపయోగించుదురు. విధేయతా మార్గంలో ఒక విశ్వాసిని నడుచునట్లు చేయు పరిశుద్ధాత్మ వక్తిని ఇది వర్ణించుచున్నది. ఆత్మపూర్ణుడైన క్రైస్తవుడు తన స్వకీయ ఆశలచేత ప్రేరేపించబడడు. కానీ సరైన మార్గములో నడిపించుటకు అతడు పరిశుద్ధాత్మకు అవకాశమిచ్చును, మాంసములో ఉప్పు కలిపినప్పుడు దానికి రుచి, పాడవకుండా చేయునట్లు ఈ ప్లీరో కూడా ఆ విధముగానే చెప్పబడినది. మన చుట్టు ఉన్నవారు మనలో కలసియున్న ఆత్మను గుర్తుపట్టునట్లు మన జీవితాన్ని రుచికరముగాను కాపాడబడునట్లును పరిశుద్ధాత్మను పొందవలెనని దేవుడు కోరుచున్నాడు, సూర్యుని వెలుగు, వేడి భూమి అంతట వ్యాపింపచేయు ఆకాశమందు ప్రకాశమానంగా ఉండు సూర్యునివలెనే కొలస్సీయులు కూడా దేవుని చిత్తానుసారమైన జ్ఞానముతో నింపబడి, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొంది ఆత్మసంబంధమైన వివేకముగలవారు కావలెనని పౌలు వారి కొరకు ప్రార్థించుచున్నాడు (కొలస్సి 1:9)
ప్రియ స్నేహితులారా, ఆత్మలో నింపబడుట అనగా ఎల్లప్పుడు ఆత్మ స్వాధీనంలో ఉండుటయే. ఏమి కోల్పోవలసి వచ్చినను మనమాయన చిత్తము చేయవలెనని దేవుడు కోరుచున్నాడు. కావున మనలను మనము ఉపేక్షించుకొని తగ్గింపుతో జీవితంలోని అన్ని విషయాలలోను అది పెద్దవైనను, చిన్నవైనను ప్రతి విషయంలోను దేవుని చిత్తము చేయుదము. అది మన ఉద్దేశాలలోను, ప్రణాళికలలోను, తలంపులలోను ఇమిడిపోవును గాక.ప్రార్ధన:- ప్రియ ప్రభువా, స్వార్ధపూరితంగా ఉండకయు లోక ప్రభావము కానీ నా మీద పడకుండా ఉండునట్లు పరిశుద్ధాత్మకు నేను అప్పగించుకొని, నీ చిత్తమెరిగి సరైన మార్గములో నడుచు కృప దయచేయుము. నీ చిత్తము తెలిసికొని దానిని చేయునట్లు నా ఆత్మను వెలిగించి, బలపరచుమని యేసు నామమున అడుగుచున్నాను. తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments