05, ఆగష్టు 2025 మంగళవారము || దేవుడెక్కడకు నడిపించినను, ఆ పనిమీద వెళ్ళుము
- Honey Drops for Every Soul

- Aug 5
- 2 min read
తేనెధారలు చదువుము : కొలస్సీ 3:22-24
‘కాగా, నా ప్రియ సహోదరులారా... స్థిరులును, కదలనివారును, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునైయుండుడి’’ - 1 కొరింథీ 15:58
‘‘దేవుని పని’’ దేవుని ‘‘కొరకు’’ చేయు పనికంటె ఖచ్చితంగా గొప్పగా, వ్యత్యాసంగా ఉండవలెను. దేవుని పనికొరకు చేయుటకు ఆయన ఇచ్చునది - ఎఫెసీ 2:10
మనమాయన కొరకు చాలా చేసి ఆయన కోసమే చేసితిమని తలంచవచ్చు. అయితే వాస్తవానికది ఆయన పని కాదు. అనుదినము దేవుడు మనకు నియమించిన పనిని పూర్ణ హృదయంతో పూర్తి చేయుటను దేవుని పని చేయుటగా ఉండును. గనుక మన పోషణ కొరకు ఏదో ఒక విధంగా పనిచేయుటను మనము తక్కువగా చూడరాదు. మనకు అది మార్పునొందిన జీవితంతోను, మన ముఖాలలో జీవము గల దేవునితో సహవాస ఆనందం ప్రతిబింబించుచు, మనతో కలసి పని చేయుచున్నవారికి మన హృదయాల నుండి ప్రేమ పొంగి ప్రవహించునట్లు చేయుచు దేవునికి పరిచర్య చేయు అవకాశముగా మనకనుగ్రహింపబడిన పనిగా మనము తెలిసికొనవలెను. క్రైస్తవులమైన మనము ఆలాగు ఉండవలెననునదియే దేవుని ఆశ. దేవుడు మనకు పని అప్పగించెను, అయితే అది మనుష్యుల మెప్పుకొరకు గానీ, మనకు పేరు తెచ్చుకొనుటకు గానీ, ఏదో విశిష్ఠమైన కార్యాలు సాధించుకొనుటకు కానీ కారాదు. దేవుడు దేనికొరకు చూచుననగా, ఇతరులతో మనమెలా కలిసి ఉండవలెనో, ప్రేమను ఎలా పంచవలెనో, దయకలిగి క్షమించు వైఖరితో ఉండుటను, కీడుకు బదులు మేలు చేయుటను, పాప దాసత్వములో ఉన్నవారి విడుదల కొరకు ఒక్క విడుదల వాక్యము ప్రటించు సామర్థ్యము కలిగియుండుటను, గాయపడిన హృదయాలను ఆదరించుటను మొ॥గు ఇదియే దేవుని లేక దేవుడిచ్చు పని.
ప్రియ స్నేహితులారా, దేవుని పని అంత సులువైనదేమి కాదు, పాపమును, సాతానును జయించి పునరుత్థానము పొందుటకు క్రీస్తుప్రభువు ప్రాణమర్పించవలసి వచ్చినది. ఇది మనము కూడా మనలను మనమర్పించుకొనవలసిన త్యాగమును కోరును. మన చుట్టు ఉండువారిలో పాపము, లోకము యొక్క శక్తి బలమైనది గనుక మనలను సాతాను నిరుత్సాహపరచుటకు సమస్త కుయుక్తులు పన్నును. పునరుత్థాన ప్రభువుతో మనము సన్నిహితంగా ఉండి, పరిశుద్ధాత్మ నింపబడుటకు చోటిచ్చినప్పుడే ఆయన పనిలో మనము స్థిరముగాను, కదలనివారుగాను ఉండుటకు శక్తి పొందుదుము.ప్రార్ధన :- ప్రియప్రభువా, సమస్యలు, కష్టాలు నన్ను నీ పని నుండి తొలగిపోయి రాజీ పడకుండా చేయుటకు కృపనిమ్ము. నీ పనిలో స్థిరముగాను, కదలనివారుగాను ఉండుటకు నీతో సన్నిహితముగా ఉండి నీ ఆత్మతో నింపబడుటకు సహాయము చేయుము. నన్ను నీవెక్కడికి పంపినను, పుష్పించి, ఫలించి నీ నామమును మహిమపరచ కృపచూపుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments