top of page

05, అక్టోబరు 2025 ఆదివారము || వట్టి మాటలు కాక క్రియలలో చూపుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 5
  • 2 min read

తేనెధారలు చదువుము : యాకోబు 1:22-25


‘‘నేను చెప్పు మాటలు ప్రకారము మీరు చేయక - ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు ?’’ - లూకా 6:46


క్రైస్తవులలో సాధారణముగా ఉండు పాపమేమనగా విశ్వసించితిమందురు కానీ దానిని అమలు చేయరు. యేసును వెంబడిరచు అనేకులు కూడా ఆయనను ప్రభువా, అని పిలుచుచు ఘనపరచుచున్నట్లు నటించిరి. కానీ, ఆయన ఆజ్ఞలకు విధేయులుగా  ఉండేవారు కాదు. ఆది సంఘములోను ఇలాగే ఉండిరి. యాకోబు 1:22లో అపొస్తలుడైన యాకోబు ‘‘మీరు వినువారు మాత్రమైయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండ, వాక్య ప్రకారము ప్రవర్తించువారైయుండుడి’’ అని హెచ్చరించెను. మన హృదయాలలో పాపము ఉంచుకొని, క్రైస్తవులు కానట్లు జీవించినంత కాలము క్రైస్తవులము అను పేరు వలన మనకు ప్రయోజనమేమియు ఉండదు. దేవునికి, ఆయన వాక్యమునకు విధేయత చూపుటయే మన విశ్వాసమునకు ఋజువైయున్నది. అలాగే మన పెదవుల పవిత్రత లేకుండా కేవలము పెదవులతో ఘనపరచుట నిష్ప్రయోజనము.  ‘‘క్రైస్తవ జీవితమునకు పునాది విశ్వాసమే కానీ విధేయత కాదని’’ కొందరు చెప్పుచుందురు. విధేయత చూపుట అనునది మన యిష్టం కాదు, అది తప్పనిసరి అని యేసు ఇక్కడ స్పష్టముగా చెప్పుచున్నాడు. క్రైస్తవ జీవితంలో అది ఒక భాగము, నియమింపబడిన విధిjైుయున్నది. మత్తయి 7:21లో తప్పుడు విశ్వాసము వలన కలుగు ప్రమాదమును యేసు చూపుచున్నాడు. ‘‘ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును’’. ఆయన పేరట అద్భుతాలు చేయుచుండినను పరలోక గుమ్మము వద్ద వారి అవిధేయతను బట్టి తిరస్కరింపబడిన సందర్భాలనేకములు ఆయన ఉదాహరణలెన్నో చెప్పెను. వారు బయటకు  నీతిమంతులుగా అగపడుచున్నను, వారి స్వార్థపరమైన తలంపులు చెడ్డ ఉద్దేశాలను దేవుడెరిగియున్నాడు.


ప్రియ మిత్రులారా, ‘‘నేను క్రైస్తవుడను, యేసే నా దేవుడు, రక్షకుడు’’ అని మనము చెప్పవచ్చు. అయితే ‘‘మీ హృదయాలను పరిశీలించుకొనుడి ! నాకు విధేయులుగా ఉండుటకు మీరు నిజముగా నన్ను వెదకుచున్నారా ? నా వాక్య వెలుగులో మీ పాపములు చూచుకొని సరిచేసికొనుచున్నారా ? లేక మిమ్మును మీరు మోసపుచ్చుకొనుచు ‘‘ప్రతి ఒక్కరు ఇలాగే చేయుదురు’’ అని రాజీపడుచున్నారా ? యేసుకు విధేయులగుట యదార్థమైనదా ? లేక నకిలీదా ? అని నిజమైన పరీక్షjైుయున్నది.

ప్రార్ధన:- ప్రియప్రభువా, నేను నీకు విధేయత కలిగియున్నప్పుడు నేను నన్ను ప్రేమించు చున్నాననియు, నాయందు నాకున్న దానికంటే నీయందే మరెక్కువ విశ్వాసమున్నదని నేను చూపుదును. యేసే నా ప్రభువని కేవలము నా పెదవులతో చెప్పక నీ ఆజ్ఞలకు విధేయుడనై, సాక్షిగా జీవించుట చేత నీ శిష్యుడనని కనబరచు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.   

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page