top of page

04, మార్చి 2025 మంగళవారము || శనివారము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Mar 4
  • 1 min read

చదువుము : యోహాను 1:43-51


ధైర్యముగా ఉండుము ! ప్రభువు మిమ్ము చూచుచున్నాడు !


‘‘... నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నేను నిన్ను చూచితిని’’ - యోహాను 1:48


ఈ లోకంలో ఏ మూలన ఉండినను దేవుడు మనలో ప్రతి ఒక్కరిని చూచును. మనమే పరిస్థితిలో ఉన్నామో కూడా ఆయన ఎరిగియున్నాడు. మనము భరించలేనంతగా ఆయన మనలను పరీక్షించడు కానీ తగిన సమయమందు ఆయన మనకు విడుదలననుగ్రహించును. లేయా తన భర్తjైున యాకోబు ప్రేమకు నోచుకోలేదు. ఆ.కాం. 29:31 చెప్పుచున్నదేమనగా, ‘‘లేయా ప్రేమింపబడకుండుట దేవుడు చూచినప్పుడు దేవుడామె గర్భమును తెరవగా ఆమె గర్భవతియాయెను’’. మనమెట్టి శ్రమలలో ఉన్నామో దేవునికి తెలుసు. ఐగుప్తులో ఇశ్రాయేలీయులను ఫరో బానిసలుగా చేసికొనినప్పుడు వారు శ్రమలో మూల్గినప్పుడు దేవుడు వారిని విడనాడలేదు. ‘‘నేను మిమ్మును, ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని’’ (నిర్గ.కాం. 3:16). వారిని విడిపించుటకు ఆయన మోషేను పంపెను. ‘‘అల్పులేమి, ఘనులేమి ఇశ్రాయేలు వారు పొందిన ఘోరమైన బాధను యెహోవా చూచెను’’ అని 2 రాజులు 14:26 కూడా చెప్పుచున్నది. గనుక యెరోబాము చేత ఆయన వారిని విడిపించెను. మన తలకు మించి శ్రమనొందునప్పుడు ప్రభువు చూచును. మార్కు 6:47-51లో గాలి బలంగా వీచుచుండగా శిష్యులు తమ నావను నడిపించుటకు ఎంతో కష్టపడుచున్నప్పుడు యేసు వారిని చూచి, వారి వద్దకు వెళ్ళి గాలిని నిమ్మళింపచేసెను అలాగే కలవరముతో ఉండిన వారి మనస్సులను కూడా నెమ్మదిపరచెను. దేవుడు మన విశ్వాసమును చూచి దానిని ఘనపరచును. మార్కు 2:5లో పక్షవాయువుగల రోగిని స్వస్థత కొరకు ఆయన వద్దకు తెచ్చిన ఆ మనుష్యుల విశ్వాసమును చూచెను. ఆ రోగిని వెనువెంటనే స్వస్థపరచుట ద్వారా ఆయన వారి విశ్వాసమును ఘనపరచెను. మనమెంతో బాధలోను, దు:ఖములోను ఉన్నప్పుడు ప్రభువు మనలను చూచును. విధవరాలి కుమారుడు చనిపోయినప్పుడు చూచిన ప్రభువు ఆమెపై కనికరపడి ‘‘ఏడ్వవద్దు !’’ అని చెప్పి ఆ కుమారుని మరణము నుండి తిరిగి లేపెను.


ప్రియ మిత్రులారా ! ప్రభువు మిమ్మును విడనాడెననుకొనుచున్నారా ? ధైర్యము తెచ్చుకొనుడి ! మీ సమస్యలో ఆయన మిమ్మును చూచి తప్పక విడిపించును.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, ప్రతి క్షణము నీవు నన్ను చూచుచుందువని, నేనిప్పుడున్న వేదనాకరమైన ఈ పరిస్థితి నుండి నీవు తప్పక నన్ను విడిపించుదువని తెలిసికొని నేనెంతగానో ఆదరింపబడితిని. ఎల్రోయిగా నీవున్నందుకు కృతజ్ఞతలు తెలుపుచు యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.


తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page