top of page

04, జులై 2025 శుక్రవారము || ఏకాంతములో మనము దేవునితో గడుపుచున్నామా ?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 4
  • 2 min read

తేనెధారలు చదువుము : మత్తయి 14:3-13 



‘‘ఆయన (యేసు) పెందలకడనే లేచి యిండును చాలా చీకటి యిండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను.’’

 - మార్కు 1:35 


ప్రభువైన యేసు ఆత్మను బలపరుచుకొనుటకును, వేదన సమయాలలో ఆదరణ పొందుటకును, తీరికలేని పరిచర్య నుండి కొంత విశ్రాంతి పొందుటకును తరచుగా ఏకాంత ప్రదేశమునకు వెళ్ళుచుండేవాడు. అటువంటి ఒక సంఘటనను మార్కు 1:32-35లో మనము చదవవచ్చు. కపెర్నహూములో తీరిక లేకుండా స్వస్థతలు చేసిన పిదప ఆ రాత్రి కొంత సమయమే నిద్రించి పెందలకడనే లేచి ప్రార్థన చేయుటకు అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. ఆయన జీవితములో హృదయాన్ని తాకే ఒక సమయమేమంటే బాప్తిస్మమిచ్చు యోహాను చంపబడెనని యేసు వినినప్పుడు ఒక దోనెలో అరణ్య ప్రదేశమునకు వెళ్ళిన విషయము.యోహాను యేసుకు వరుసకు సహోదరుడు. అయితే దానిని మించి యేసు ఈ లోకానికి వచ్చునని ముందుగా యోహాను ప్రకటించుచుండినవాడు. బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క మరణము ప్రభువును ఎంతగానో కదిలించివేసియుండును. ఆయన అలా ఏకాంత స్ధలానికి వెళ్ళినప్పుడు ఆయనను  వెంబడిరచిన ప్రజలు ఆయనను ఆటంకపరిచిరి. వారిని చూచి ఆయన కనికరముతో కదిలింపబడి సముద్ర తీరాన ఉన్న దోనె ఎక్కి వారికి బోధించి, స్వస్థపరిచి, ఐదువేల మందికి ఆకలి తీర్చెను.ఆ తరువాత ఈదిన వాక్యభాగము చెప్పుచున్నట్లు ఆయన తన శిష్యులను ఆవలి తీరానికి పంపివేసి, జనులను కూడ పంపివేసి ప్రార్థించుకొనుటకు కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా గడిపెను.(మత్తయి14:23) ఆయన సేదదీరి, మరింత బలముగా ఇంకొంత కాలము పరిచర్య చేయుటకు తన తండ్రితో ఏకాంతముగా గడిపిన ఈ సమయాలే కారణము.

ప్రియమిత్రులారా, క్రైస్తవ జీవితములో ఎదురయ్యే క్లిష్టమైన సవాళ్ళను మనము తప్పించుకొన ప్రయత్నించరాదు. ఆత్మీయంగా జయించవలెనంటే, మరియు సమస్యల నధిగమించవలెనంటే మన ప్రభువునుండియే మనము శక్తి పొందవలసిన అవసరమున్నది. మనకు మనమును, దేవునితోను ఏకాంతముగా గడపవలసియున్నది. మన క్రైస్తవ జీవితములో ఆత్యంత ప్రాముఖ్యమైన విషయమేమనగా ఆయనతో ఏకాంతముగా మనము గడుపుటను దేవుడు చూచు సమయాలే. ఏకాంత సయమయులో మనము దేవునితో గడుపుచున్నామా? అట్టి ఏకాంత సమయం, ఏకాంత ప్రదేశంలో మన హృదయాలను నూతనంగా నింపవలెనని దేవుడు కోరుచున్నాడు. 

ప్రార్థన : ప్రియప్రభువా, నీతో మాట్లాడుటకును, నీ వాక్యము ద్వారా నీ స్వరము వినుటకును ఏకాంత ప్రదేశమునకు వెళ్ళు అలవాటు చేసికొను కృపనిమ్ము. నా క్లిష్ట పరిస్ధితులలో నీ చిత్తము నెరుగుటకు మరింత ఎక్కువ సమయం గడుపుటకు సహాయము చేయుము. ప్రార్ధన ద్వారానే జయమును, జయించుటకు శక్తిని పొందుదుమని ఎరిగి యేసునామమున అడుగుచున్నాను తండ్రీ, ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page