top of page

04, జూన్ 2025 బుధవారము || క్లిష్ట సమయాలలో దేవునియందు నమ్మికయుంచి ఓపికతో కనిపెట్టియుండుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jun 4
  • 1 min read

తేనెధారలు చదువుము :హబక్కూకు 3:16-19



‘‘నేను వినగా... నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, అయినను నేను ఊరుకొని కనిపెట్టవలసియున్నది’’

- హబక్కూకు 3:16



ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును చూచినప్పుడు బబులోనువారు దానిపై దాడిచేసి నాశనము చేయబోవుచున్నారని ఇశ్రాయేలు ఆ దారిలో నడుచుచున్నదని చూచి హబక్కూకు ఎంతో భయముతో వణికిపోయెను. దేవుని తీర్పుగా బబులోనువారు వచ్చుదురను ఆలోచనయే అతనిని నిశ్చేష్ఠునిగా చేసెను. ఎక్కడ చూచినను ఆలోచనయే అతనికి కనబడెను. అయితే తన అంతరంగములోను, బయటను ఎలా ఉండినను అతడు విశ్వాసముతో పైవైపు చూచినప్పుడు అతడు దేవుని చూచెను. గనుక అతని భయాలన్నియు అదృశ్యమాయెను. విశ్వాసముతో నడుచుట అనగా దేవుని మహిమ, మహాత్మ్యముపై దృష్టి నిలుపుట అని అర్థము. గతములో తన జనులను సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు రక్షించిన విధమును హబక్కూకు గుర్తుచేసికొని, ఇప్పుడు కూడా ఆయన విడిపించునని అతడు నిరీక్షించెను. అయితే ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రణాళిక ఏమైయున్నదో అర్థం చేసికొనిన హబక్కూకు యొక్క దృక్పథము మారిపోయెను. రాబోవు ఉగ్రతను తలంచి కూడా అతడు దేవునియందే నమ్మికయుంచి ఏమి జరగబోవుచున్నను అతడు ఆనందించెను. కోరీ టెన్ బూమ్ యొక్క ఒక ప్రసిద్ధిచెందిన మాట హబక్కూకు మనస్సును చూపుచున్నది. ‘‘నీవు ఈ లోకమును చూచినట్లయితే నీవు కలవరపడుదువు. నీలో నీవు చూచుకొంటే కృంగిపోవుదువు. దేవునివైపు చూచినట్లయితే నీకు నెమ్మది కలుగును.’’


ప్రియ మిత్రులారా, పరిస్థితులను బట్టి ఊపిరాడనట్టున్నను, నెమ్మది, విశ్రాంతి కరువైనట్లున్నను హబక్కూకును మనము అనుకరించుదుము. మనకు వ్యక్తిగతముగా ఇయ్యబడిన దేవుని గొప్ప వాగ్ధానములలో ప్రతి ఒకటి కూడా నెరవేర్చబడునను ధైర్యముతో ముందుకు చూచెదము. దేవుడు తన శత్రువులకు తన సమయంలోనే తీర్పు తీర్చునని, ఆయన ఆ పనిలోనే ఉండెనని ఎరిగియుండెను గనుక హబక్కూకు సహనముతో మౌనంగా వేచియుండగలిగెను.  మన  జీవితంలో  దేవుడు  పనిచేయుచున్నాడను  నిశ్చయత మనకున్నప్పుడు మనమాయన కొరకు ఓపికతో కనిపెట్టుకొనియుండి, ఆయన ఎల్లప్పుడు శ్రేష్ఠమైనదే చేయునని ఆయనను అనుమతించగలము.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నా చుట్టు ఏమి జరుగుచున్నను, నాకేమి అనిపించినను నీ వాగ్ధానాల మీద ఆధారపడి, నేను కృంగిపోకుండా ధైర్యముగా ఉండి, శ్రమల తుపానులు నాపై గట్టిగా కొట్టునప్పుడు నీ సత్య వాక్యమును గట్టిగా పట్టుకొని, నీ సన్నిధి, ఆదరణ నన్ను నిత్యము ఎత్తిపట్టు కొనునని నమ్ముచు, యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page