04, ఆగష్టు 2025 సోమవారము || సామాన్యులను అసాధారణమైనవి చేయునట్లు దేవుడు వాడుకొనును
- Honey Drops for Every Soul

- Aug 4
- 2 min read
తేనెధారలు చదువుము : 1 కొరింథీ 1:26-31
‘‘ఏ శరీరియు దేవుని యెదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెఱ్ఱివారిని దేవుడు ఏర్పరచుకొనియున్నాడు’’
- 1 కొరింథి 1:28,29
అనేక స్థితిగతులను బట్టి గొప్పతనమును ఈ లోకము లెక్కగట్టును. అన్నిటికన్న మిన్నగా తెలవితేటలు, సంపద, పరువు ప్రతిష్ఠలు మొ॥ ఉన్నవి. కానీ, దేవుడు వీటిని అట్టడుగున ఉంచును. ఈ లోకంలో ‘‘ఏ విలువలేని వారిని దేవుడు ‘‘తనకు చెందిన స్థితిగలవారిగా’’ చేసి తన మహాత్మ్యమును వెల్లడి చేయును’’ అని మెక్ ఆర్థర్‌గారు చెప్పుచున్నారు. ఒక సువార్త కూడికలో మానసిక రోగిjైున జోయె అను ఒక బాలుడు గాయక బృందంలో కలిసి పాడుటకు ప్రతి రాత్రి నమ్మకంగా వచ్చుచుండెను. ఆ బృంద నాయకుడైన హోమెర్ రోడెహెవర్ ఏమన్నాడంటే - జోయె ఏమంత బాగా పాడలేదు కానీ, అతడు మన కూడికలన్నిటికి తప్పకుండా హాజరై ముగింపు వరకు ఉంటున్నాడు. కొన్నిసార్లు అతడు వెళ్ళిపోతే బాగుండును అని నా మనసులో అనుకొనువాడను. అప్పుడొక వ్యక్తి ఆ నాయకుని వద్దకు వచ్చి ‘‘నా కుమారుని పట్ల మీరు చూపుచున్న దయను బట్టి వందనాలు. వాడిప్పుడు మానసికంగా బాగాలేడు కానీ, వాడు గాయక బృందంతో కలిసి పాడుచున్నప్పటి వలె మునుపెన్నడు అలా సంతోషంగా లేడు. ఎందుకంటే అతడు మమ్మును బ్రతిమాలుచుండుట చేత నా భార్య మరి ఐదుగురు పిల్లలు ఈ కూడికకు వచ్చిరి, ఇప్పుడు వారు క్రీస్తును స్వీకరించిరి. గత రాత్రి అతని 75 సం॥ల వయస్సున్న దేవుడు లేడనే తాత రక్షింపబడెను, ఈ రాత్రి వాని అమ్మమ్మ కూడా ముందుకు వచ్చినది’’, దేవుడు పనికిరాని, బలహీనుడు, వెఱ్ఱివాడైన జోయేను తన బలమైన సేవకునిగాను, అతని కొరకు గొప్ప సాక్షిగాను వాడుకొనెను.
ప్రియ మిత్రులారా, పనికిరాని వస్తువులతో కళాఖండాలు తయారు చేయబడుటను మనందరము చూచియుందుము. అవి గిటారుకున్న పాత తీగెలు, పగిలిన పింగాణీ ముక్కలు, ఊడిపోయిన గుబ్బలు మొ॥గు కావచ్చు. ప్రతి ఒక్కటియు ఏ మాత్రము పనికి రానివే. అయితే ఈ ఉపయోగములేని విడి భాగాలతో ఒక హస్తకళాకారుని చేతులు అసాధారణ కళాఖండాలుగా మార్చును. దేవుడు కూడా అట్టి కళాకారుడైయుండి ఏ విలువలేని మన జీవితాలను చేపట్టి మలచి వాటిని వెలకట్టలేని కళాఖండముగా మార్చును. కానీ కొన్నిసార్లు మనము మన ‘‘అయోగ్యతను, పనికిరానితనమును’’ మరచుదుము. ‘‘మనమెంతో విలువైనవారము’’ గనుకనే దేవుడు మనలను అంత గొప్పగా చేయునని అనుకొనుచుందుము. దేవుడు తన కృప చొప్పున తనను తాను తగ్గించుకొని ఏ యోగ్యతలేని, పనికిరాని, చెత్తవంటివారమైన మనలను తన మహిమార్థము వాడుకొనునని మనము గ్రహించుదము.ప్రార్థన : ప్రియప్రభువా, లోకము మెచ్చుకొను తలాంతులు, అర్హతలు, సంపద లేక వివేకము నాకు లేదు కానీ, నీ కృపచేత నన్ను ఎన్నుకొని నీ కనికరము నాపై ఉంచి, నీ మహిమార్థము నన్ను వాడుకొనుచుండుట నా ధన్యతjైుయున్నది. ఎల్లప్పుడు, ఎన్నటెన్నటికి నీకు నమ్మకముగా నిలిచియుండు కృపనిమ్మని యేసునామమున అడుగుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments