04, అక్టోబరు 2025 శనివారము || దేవునితో కలసి పరిచర్య చేయుము
- Honey Drops for Every Soul
- Oct 4
- 1 min read
తేనెధారలు చదువుము : హెబ్రీ 13:20-21
‘‘... తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన... మనలో జరిగించును గాక’’
- హెబ్రీ 13:21
దేవుడు తనపై తిరుగుబాటు చేసిన మానవాళి ఎంతో దుస్థితిలో ఉండుట చూచెను. వారు బాధలోను, బ్రద్దలైన స్థితిలోను, నిరాశ, నిస్ప ృహ మరియు రోగము, పాపము, తిరుగుబాటుతనముతోను ఉండుట ఆయన చూచెను. ఆయన ఎలా స్పందించెను ? వారి అవసరత తీర్చెను. అది ఎలా ? నిత్యనాశనమునుండి వారి ఆత్మలను రక్షించుటకు ఆయన ఏకైక కుమారుని పంపెను. ఆయన ప్రేమ, కనికరములు గల దేవుడు. అంత మాత్రమే కాదు. ఆయన తన స్వభావమును మనకనుగ్రహించి, మనమాయన విమోచించిన పనిjైుయుండవలెనని కోరుచున్నాడు. మనమాయన కృపను పొందువారమే కాక ఆయన పనివారమైయుండి, ఆయన తోడిపనివారమైయున్నాము. మన చుట్టు బాధించువారును, పాప స్వభావాలు కలిగి జీవించువారున్నారు. మనలను రక్షించుటకు యేసును పంపిన దేవుడు ఆ తరువాత చేయవలసిన పరిచర్య కొరకు మనలను ఈ లోకంలోనికి పంపును. ఎందుకని ? ఆయన మన ద్వారా పనిచేసి, అవసరమైనది చేయవలెనని కోరుచున్నాడు. ప్రేమ, కనికరము, దయ, సమాధానము, నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఆయన యొక్క ప్రేమ సాధనాలుగా మనలను వాడుకొనవలెనని కోరును. ఈ నూతన నిబంధన సంఘ చిత్రమిదియే. ఆయన యొక్క విమోచన కార్యాన్ని సంపూర్తి చేయుటకు ఆయన తోడిపనివారిగా చిత్రించి చూపెను. కేవలము దేవునితో సమాధానపడుటయే విమోచన కాదు గానీ మనమాయనతో పూర్తిగా ‘‘సరిపోల’’వలెనని ఆయన ఉద్దేశము. ఆయన తనను తాను ప్రత్యక్షపరచినట్లే మనము అన్ని విధాల ఆయనను ప్రతిబింబించుచు అవసరతలో ఉన్నవారి కొరకు అత్యంత కనికరమును చూపవలసియున్నది. ఆయన చిత్తము నెరవేర్చుకొనుటకు మనలో ఆయన పనిచేయును.
ప్రియ మిత్రులారా, ప్రశ్న ఏమనగా, దేవుడు తనను తాను మనకు బయలుపరచుకొన్నాడు కానీ, ఎంతో అవసరతలో ఉన్న ఈ లోకానికి మనద్వారా ఆయన తనను తాను వెల్లడి చేసికొనుచున్నాడా అనేదే ఇప్పటి విషయము. ఈ ప్రశ్నకు జవాబు చాలా క్లిష్టమైనది. నేను దేవునితో కలిసి పనిచేయుచున్నానా?
ప్రార్ధన :- ప్రియప్రభువా, మా పట్ల నీకున్న ప్రేమ చేత మా పాపము నుండి మనమును విమోచించుటకు నీ అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించితివి. నేనిప్పుడు విమోచింపబడినవాడను గనుక నీ విమోచన కార్యాన్ని నేను సంపూర్తి చేయు కృపనిమ్ము. నశించుచున్న ఈ లోకమును నా ద్వారా నిన్ను వెల్లడి చేయునట్లు నీ జత పనివానిగా ప్రయాసపడుటకు సహాయము చేయుమని యేసునామమున వేడుకొను చున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177
Comments