03, మార్చి 2025 సోమవారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 3
- 1 min read
చదువుము : ఆ.కాం. 32:22-29
పరలోక తండ్రిచేత మీ పేరు మార్చబడినదా ?
‘‘... మరియు అతనికి తెల్లరాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్త పేరుండును...’’
- ప్రక 2:17
బైబిలునందు దేవుని చేత పేరు మార్చబడిన మొదటి వ్యక్తి అబ్రహాము అతని తండ్రిjైున తెరహు అతనికి పెట్టిన పేరు అబ్రాము, దీని అర్థము ‘‘ఘనపరచబడిన తండ్రి’’ అని, కానీ పరలోక తండ్రి అతని పేరును అబ్రహాముగా మార్చెను, అనగా ‘‘అనేకులకు తండ్రి’’ అని. ఆ ప్రకారము ఆ తరువాత అబ్రాహాము అనేక జనములకు, జాతులకు, అనగా యూదులు, క్రైస్తవులు, ముస్లిములకు తండ్రియాయెను. (ఆ.కాం. 17:5). దేవుడు అతని భార్య పేరును కూడా మార్చెను. ఆమెకు పుట్టినప్పుడు పెట్టిన భార్య శారాయి, అయితే ప్రభువు ఆమె పేరును శారాగా మార్చెను. దీని అర్థము ‘‘రాజకుమారి’’ (ఆ.కాం. 17:15). ఆమె సుందరమైనదేకాక మంచి గుణగణాలు కలది. ఆమె తన భర్తను గౌరవించి క్లిష్ట పరిస్థితులలోను ఆయనతోనే నిలిచియుండెను. తరువాత యాకోబును గూర్చి చదువుదుము. ఆయనకు కూడా పేరు మార్చబడినది. యాకోబు అనగా ‘‘మోసగాడు’’. ఇస్సాకునకు దృష్టిమాంద్యము కలిగి వృద్ధుడైయున్నప్పుడు యాకోబు అతనిని మోసంచేసి తన పేరు ఏశావు అని చెప్పి ఆశీర్వాదాలన్ని పొందెను. కానీ, దేవుడతని పేరు ‘‘ఇశ్రాయేలు’’గా మార్చెను. అనగా ‘‘దేవునితో పోరాడినవాడు’’ అని. నూతన నిబంధనలో పేతురును గూర్చి చదివితే అతని తండ్రిjైున యోహాను అతనికి సీమోను అని పేరుపెట్టగా దేవుడతని పేరును పేతురు, లేక కేఫా అని మార్చెను. దీని అర్థము రాయి. మత్తయి 16:18లో ‘‘నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును’’ అని యేసు అతనితో అనెను.
ప్రియ మిత్రులారా, మన తల్లిదండ్రులు మనము పుట్టినప్పుడు ఏదో ఒక పేరుపెట్టియుండవచ్చు. ఆ పేరు ఎంత మంచిదైనను క్రీస్తుప్రభుని దృష్టిలో మనందరము పావులమే. యేసును మన ప్రభువుగాను, రక్షకునిగాను స్వీకరించినప్పుడు ఆయన మనలను పవిత్రపరచి మనకొక క్రొత్త పేరు పెట్టును. మనమిక మీదట అపవాది సంబంధులము కాము కానీ దేవుని సొత్తయినవారము. ఏ విధముగానైనను దేవుని పేరుకు అవమానము కలుగకుండునట్లు బ్రదుకుదము.
ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నీవొక ఉద్దేశముతోనే అబ్రాము, శారాయి, యాకోబు, సీమోను పేర్లను మార్చితివి. నీ రాజ్య పనిలో వారికి ప్రత్యేకమైన పాత్రలనిచ్చితివి. నేనొక పాపిని ప్రభువా, నీవద్దకు వచ్చితినినను బాహ్యంగాను, అంతరంగములోను నన్ను మార్చి నీతిమంతునిగా చేసి నీ చిత్తానుసారము నన్ను వాడుకొనుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Kommentare