top of page

03, జులై 2025 గురువారము || ఒకరి భారములు ఒకరు కలసి భరించుడి

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 3
  • 1 min read

తేనెధారలు చదువుము : మత్తయి 22:37-40



‘ఒకని భారముల నొకడు భరించి, యిలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి’’  - గలతీ 6:2

 

ఈ వచనములోని భారములను పదము మోయలేని బరువును, తన జీవిత మార్గము పొడవున పెద్ద బండరాయి మోయలేక తడబడునంత భారమును సూచించుచున్నది. ఆ బండరాయి ఒక రోగమునో లేక వ్యక్తిగతముగా, ఆర్ధికంగానో, సంబంధ బాంధవ్యాలలో సమస్యలో అయియుండవచ్చు. ఏ సహోదరుడు లేక సహోదరిjైునను మోయలేని భారముతో ఉన్నట్లు మనము చూచినప్పుడు మనము ఏమి చేయుచున్నను దానిని విడిచిపెట్టి వారి భారము భరించి సాయము చేయవలెనని ఇక్కడ పౌలు గారు చెప్పుచున్నారు. వారిని విమర్మించుటకు బదులుగా మనము చేయగలిగినంత, చేయగలిగినంత కాలము సాయము చేయుదుము. ఖచ్చితముగా మన కార్యకలాపాలకు ఆటంకము కలిగించవచ్చు లేక ఆలస్యము కావచ్చు. కానీ, బాధపడుచున్న వారికి సాయంచేయవలెనను దర్మనము ఒక క్రైస్తవ శిష్యరికములోని భాగముగా మనము కలిగియున్నట్లయితే ఇతరుల భారాలు మనకు యే మాత్రము అభ్యంతరముగా ఉండవు.కాగా మనము క్రీస్తు నియమమును నెరవేర్చుదుము. క్రీస్తు నియమేమిటి ? దేవునినే ఉన్నతముగా ప్రేమించి, అలాగే మనవలె మన పొరుగు వారిని ప్రేమించవలెనను ప్రభుయేను చెప్పిన మాటను తెలుపుచున్నది. (మత్తయి 22:37-40) యోహాను 13:34లో యేసు ఆజ్ఞాపించినట్లు ఒకరునొకరు ప్రేమించవలె ననునదే క్రీస్తు నియమము.


ప్రియ స్నేహితులారా, విశ్వాసి ఈ లోకములో ఉన్నది దానినుండి ఏదో పొందుటకు కాదుగానీ దానిని అతడేమి చేయగలడో అది చేయుటకును, ఇక్కడ ఉండగానే ఏ సహాయమైనను చేయుటకే. మన మీ జీవనయానం సాగించుచుండగా మోయలేని భారమును మోయచు శ్రమ పడుచున్న వారిని చూచినప్పుడు యేసుప్రభువు ఏమి చేయును? అని ప్రశ్నించుకొందము. జవాబు ‘‘చూచునే సాగిపొమ్ము’’ అని మాత్రము కానే కాదు, కానీ ‘‘తప్పక ప్రభువు ఈ పరిస్ధితిని మార్చును’’ అని ఆయన ఖచ్చితంగా వచ్చి, శ్రద్ధ వహించి, దేవుని ప్రేమ, కృపా కనికరములను చూపును. కావున స్వార్థముతోను, కఠనాత్ములుగా, శ్రమలో ఉన్నవారిని వారి అదృష్టానికే వారిని విడిచిపెట్టక ప్రేమతో ఒకరికొకరము సాయము చేసికొందము.

ప్రార్ధన :-  ప్రాయప్రభువా,క్రీస్తునందు నా సహోదరుడో లేక సహోదరియో మోయలేని భారముతో తూలి, తడబడుచుంచుట చూచి స్వార్ధముతో కఠినంగా ఉండక దయచూపు కృప ననుగ్రహించుము. కృంగిపోయి, కన్నీటితో ఉన్నవారికి సాయం చేసివారి భారమును పంచుకొని క్రీస్తు నియమమును నెరవేర్చి నన్నువలె నా పొరుగు వారిని ప్రేమించుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page