03, జూన్ 2025 మంగళవారము || దానియేలు చేసిన ప్రార్థన ఆత్మ మనకున్నదా?
- Honey Drops for Every Soul

- Jun 3
- 1 min read
తేనెధారలు చదువుము :దానియేలు 6:1-10
‘‘యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళూని ...తన దేవునిని ప్రార్థన చేయుచు... వచ్చెను’’ - దాని 6:10
యెరూషలేము పట్టణము తిరిగి కట్టబడుట కొరకు దానియేలు తన యింటి పైగది కిటికీ యెరూషలేమువైపు తెరచియుంచి అనుదినము ముమ్మారు ప్రార్థించు అలవాటు అతనికి ఉండెను. రాజైన దర్యావేషునకు తప్ప మరే మనిషికి కానీ, దేవునికి కానీ విన్నపము చేయరాదని ఒక కుట్రపూరితమైన ఆజ్ఞ జారీ చేయబడెనని తెలిసిన పిదప కూడా అతడు తన ‘‘ప్రార్థనా కార్యక్రమము’’ కొనసాగించెను. దానియేలు ప్రార్థన దేవునికే ప్రాధాన్యతనిచ్చెను. దేవునికి ప్రార్థించు తన హక్కును విడిచిపెట్టుట కంటె మరణించుటకే సిద్ధపడునంతగా దానియేలుకు ప్రార్థనయే అంత ప్రాముఖ్యమైనది ! క్రీస్తును దూషించకపోతే చంపివేయుదుమని స్ముర్నలో బెదిరింపబడిన ఆది సంఘానికి చెందిన ఫాదర్లలో ఒకరైన పాలికార్ప్ గారిని మనకు దానియేలు జ్ఞాపకము చేయుచున్నాడు. ‘‘నేను 86 సం॥లు ఆయనను సేవించుచుండినను నాకు ఆయన ఏ హాని చేయలేదు. మరి అట్టి నా రక్షకుడు, రాజునైన క్రీస్తుప్రభుని నేనెలా దూషించగలను ?’’ అని ఆయన జవాబిచ్చెను. ఆ విధముగా తెలిసినను గొప్ప క్రమశిక్షణా జీవితము అతనికి అవసరమైయుండెను. గొప్ప పదవిలో ఉన్న అతనిపై గొప్ప బాధ్యత ఉండినను అట్టి క్లిష్టమైన పరిస్థితులలో ఉన్నప్పుడు దినమునకు ముమ్మారు ప్రార్థించుటను త్రోసివేయవలెనను శోధన ఎంతో బలమైనదనుటకే సందేహము లేదు. తనకు తీరిక లేదని సులభంగానే ప్రార్థించుట తప్పించుకొనియుండగలిగి యుండవచ్చు. మధ్యాహ్నము అతడు ప్రార్థించుటకు ఇంటికి రావలసి వచ్చేది. అలాగే ఉదయం, సాయంకాలాలు కూడా ప్రార్థించుచుండెను. అయినను అతడు తన పట్టుదలలో రాజీ పడలేదు. దేవునికి ప్రార్థించుట అతనికి అవసరమైయుండెను గనుక అలా చేయకుండా ఏదియు దానిని అడ్డుకొనలేకపోయెను. అతడు తన పరిస్థితులను చూడక దానిని మించి సర్వశక్తిమంతుడైన దేవుడు తన చిత్తమైతే అతని విడిపించగల సమర్థుడని ఆయన మీదనే దానియేలు తన దృష్టి నిలిపెను.
ప్రియ స్నేహితులారా, దానియేలుకున్న ప్రార్థనా ఆత్మ మనకున్నదా ? ఈ అననుకూల, అన్యజనులున్న లోకములోను దేవుని కొరకు జీవించుటకు మనకు ధైర్యమున్నదా ?ప్రార్ధన:- ప్రియ ప్రభువా, దానియేలు తన పై గది కిటికీలు మూసివేసి రహస్యంగా ప్రార్థించియుండవచ్చు కానీ అతడు రాజీపడక, ధైర్యముతో తన ప్రాణము కోల్పోవునని తెలిసిన తరువాత కూడా ప్రార్థనకే ప్రాధాన్యతనిచ్చెను. ఎట్టి పరిస్థితిలోను రాజీపడక ప్రార్థించుచు నీ కొరకే స్థిరముగా నిలిచియుండు కృపనిమ్మని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments