03, ఏప్రిల్ 2025 గురువారము || ప్రభువు నా ప్రక్కన ఉన్నాడుగనుక నేను ధైర్యముగా ఉందును
- Honey Drops for Every Soul
- Apr 3
- 1 min read
తేనెధారలు చదువుము : మార్కు 6:17-28
‘‘రాజా - నీకిష్టమైనది ఏదైనను నన్నడుగుము, నేను నీకిచ్చెదనని ఆ చిన్నదానితో చెప్పెను’’- మార్కు 6:22
రెండు వేర్వేరు కాలాలలో ఉండిన ఇద్దరు వేరు వేరు రాజులు ఇద్దరు వేర్వేరు స్త్రీలకు తమ రాజ్యములో మట్టుకు ఇచ్చెదమని చెప్పిన రెండు సందర్భాలు బైబిలునందున్నవి. మొదట రాణిjైున ఎస్తేరు. రాజైన దర్యావేషు యొక్క రాణిjైున వష్తి యొక్క గర్వము, అవిధేయతను బట్టి ఆమెను త్యజించిన పిదప ఆయన ఎస్తేరు యొక్క తగ్గింపును బట్టి ఎంతగానో ఆకర్షితుడాయెను. అతడామె పట్ల ఎంతో ఆప్యాయత కలిగియుండెను. గనుకనే అతని అనుమతి లేకయే రాజభవనంలోని ఆవరణలోకి ప్రవేశించినను అతడు కోపగించలేదు (ఎస్తేరు 5:2). అంతేకాదు ‘‘రాణిjైున ఎస్తేరూ, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి ? రాజ్యంలో సగము మట్టుకైనను నీకియ్యబడును’’ అనియు అడిగెను. అప్పుడు రాణిjైున ఎస్తేరు, దుష్టుడైన హామాను నుండి యూదులను కాపాడుమని చెప్పెను. ఆమె వినతిని రాజు అంగీకరించెను. యూదులు అప్పుడు కాపాడబడినందున షూషనునందు గొప్ప ఆనందం కలిగెను. ఆ విధంగా ఎస్తేరు తన జనుల క్షేమము కొరకు తన అధికారము నుపయోగించెను.
రెండవది హేరోదియ యొక్క కుమార్తె హేరోదియకు రాజైన హేరోదుతో ఉన్న అక్రమ సంబంధమును బట్టి బాప్తిస్మమిచ్చు యోహాను గద్దించినపుడు ఆమె అతనిని చంపనుద్దేశించెను. ఆమె గొప్ప విందు ఏర్పాటు చేసి రాజు మరియు అధికారుల ఎదుట తన కుమార్తె నాట్యము చేయునట్లు చేసెను. అది చూచిన రాజు ఎంతగానో సంతోషించి ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని వాగ్ధానమిచ్చెను. అప్పుడా కుమార్తె బాప్తిస్మమిచ్చు తలను ఒక పళ్ళెములో పెట్టి తనకిమ్మని కోరెను ! ఆ ప్రకారమే రాజు యోహానును చంపించెను. ఆ విధముగా హేరోదియ తన అధికారమును నాశనము కొరకు ఉపయోగించెను.
ప్రియ స్నేహితులారా, ఇద్దరు విభిన్నమైన రాజుల ఎదుట ఇరువురు వేర్వేరు స్త్రీలు చేసిన రెండు విజ్ఞాపనల - ఒకటి రక్షణ కొరకు, మరొకటి నాశనము కొరకు. రాజుల రాజుకు మన విన్నపమేమిటి ? తగినదాని కొరకే మనము ప్రార్థించుచున్నామా ?
ప్రార్ధన:- సర్వశక్తి గల దేవా, ఏదైన అడుగుటకు నాకు స్వేచ్ఛ నిచ్చితివి ! కానీ నాకు విరోధంగా ఉన్నవారిని శిక్షించుమని నా స్వార్ధము నిమిత్తము ప్రార్థించకుండ కృప దయచేయుము. అయితే తీర్పుకొరకు దానిని నీకు విడిచిపెట్టి, బదులుగా నా జనుల రక్షణ కొరకు ప్రార్థించుటకు సహాయము చేయుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments