top of page

03, ఆగష్టు 2025 ఆదివారము || బాబెలు యొక్క గర్వము, దాని పతనము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Aug 3
  • 2 min read

తేనెధారలు చదువుము : ఆది కాం. 11:1-9



‘‘అప్పుడు నరుల అహంకారము అణగద్రొక్కబడును, మనుష్యుల గర్వము తగ్గింపబడును’’ - యెషయా 2:17



ఈ వాక్యభాగమును ‘‘ఈ అధునాతన ప్రపంచానికి అద్దం పట్టుచున్నట్లున్నది’’ అని జె.ఐ. ప్యాకర్‌గారు అన్నారు. బాబేలు గోపురము కట్టుచుండిన వారికి కొన్ని ప్రత్యేకమైన ఉద్దేశాలుండినవి. మొదట, ఒక పట్టణము కట్టవలెనని, రెండవది, ఆకాశాన్ని అంటునంతగా ఒక గోపురము పట్టణములో కట్టుటకు, మూడవది, వారికి పేరు సంపాదించుకొనుటకు, నాల్గవది, భూమియంతటికి చెదరిపోకుండునట్లు. ఏథేను వనములో ఆదాము, హవ్వలను మోసగించి ‘‘వారు మంచి, చెడులను ఎరుగునట్లు’’ ఆ తోట మధ్యలో ఉన్న ఆ వృక్షఫలము తినినచో వారు దేవుని వలె అగుదురని చెప్పెను. అప్పుడు వారిద్దరు సాతాను వలలో పడిపోయిరి. ఇక్కడ మరొకసారి బాబెలులో వారు ఒక పట్టణం కట్టి, దానిలో పరలోకమునంటు ఒక గోపురము కట్టి పేరు సంపాదించుకొని దేవునివలె అగుదుమని ప్రయత్నించిరి. ‘‘ఈ భూమి మీద మాదే గొప్ప పట్టణము, ఎవరు దానిని అందుకొనలేరని’’ వారు ప్రకటించవలెనని కోరుకొనిరి. మొత్తానికి ఈ సృష్టినంతటిని చేసిన సార్వభౌమాధికారిjైున దేవుని వారు మరచిరి. ‘‘యెహోవా యిల్లు కట్టించని యెడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే’’ అను మాటను వారెరుగకుండిరి (కీర్తన 127:1). వారి ఈ గర్వమే వారి పతనానికి దారి తీసినది. తన నగరునందు సంచరించుచు - ‘‘ఈ బబులోను మహా పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా ? అని తన గొప్పతనమును గూర్చి అతిశయించిన రాజు నెబుకద్నెజరును ఈ సంఘటన మనకు గుర్తు చేయుచున్నది (దాని 4:30). మానవాళి పాలకుడైన దేవునికి విరోధంగానే అతడు తనను తాను హెచ్చించు కొనెను. కానీ ఆ మాటలు ఇంకను అతని నోట యుండగానే దేవుని ఉగ్రత అతని మీదకు వచ్చి ఆయన భయంకరమైన తీర్పును అతడు ఎదుర్కొనవలసి వచ్చెను.



	ప్రియ మిత్రులారా, గోపురము కట్టుటలోను, కోరికలుండుట, గెలుపు సాధించి దానిలో ఆనందించుటలో తప్పేమియు లేదు, కానీ దాని నుండి గర్వము, అధికారము, పేరు ప్రఖ్యాతులు మన కళ్ళకు గ్రుడ్డితనము కలిగి మన సృష్టికర్తను మరువక యుండుటకు జాగ్రత్త పడుదము.


ప్రార్ధన :- ప్రియ ప్రభువా, ఎన్నో తరాలకు ముందు ఉన్నట్లే మానవాళి స్థితి అలాగే యుండుట ఎంత విచారము ! మనుష్యులు ఏది శ్రేష్ఠమైనదో లేక ఆకాశమందు నీ స్థానాన్ని చేరుకొనుటకు తమ్మును తాము హెచ్చించుకొనుటకు తీర్మానించుకొందురు. అట్టి అహంభావానికి తావియ్యక, సమస్త మహిమ, ఘనత నీకే చెల్లించుటకు సహాయము చేయుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రి ఆమెన్‌.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page