top of page

03, అక్టోబరు 2025 శుక్రవారము || దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Oct 3
  • 1 min read

తేనెధారలు చదువుము : లూకా 10:35-42


‘‘అందుకు ప్రభువు - ‘‘మార్తా, మార్తా’’ నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గానీ అవసరమైనది ఒక్కటే’’ - లూకా 10:41,42


మనకు అత్యంత ప్రాముఖ్యమైన విషయమును ప్రక్కకుబెట్టు అనేక మంచి విషయాలకు మన జీవితంలో ఎక్కువ సమయం వెచ్చించుచుందుము. దీనిని మనమొక ఉదాహరణతో అర్థం చేసికొనగలము. మన బిడ్డను ప్రపంచ ప్రఖ్యాత పియానిస్టుగానో, ఆటగానిగానో తీర్చిదిద్దు ఆశ కలిగియుంటే అతని బాల్యము నుండే శిక్షణనిచ్చుటకారంభించుదుము. ప్రతి దినము, వారాల తరబడి, సం॥లుగా మనము క్రమము తప్పక సాధన చేపించుదుము. మరేదైనను దాని తరువాత స్థానంలోనే ఉంచుదుము. ‘‘ఇతరులు సాధారణంగా చేయు’’నవన్నియు ఆ బిడ్డ విడిచిపెట్టవలసి వచ్చును. ఆ ‘‘ఒక్క విషయమే మిగిలిన’’ అనేక విషయాలకంటే ప్రాధాన్యత సంతరించుకొనవలసియుండును. ఇదియే యేసు మార్తకు గట్టిగా చెప్పినది. ‘‘మార్తా, నీవు వంట చేయుటలోను, వడ్డించుటలోను విస్తారముగా పని కలిగియున్నావు. నీ ఉద్దేశాలు మంచివే, కానీ నీ హృదయము పరిపరి విధాల పనిచేయు చున్నది. నాకు పరిచారము చేయవలెనను నీ తపన నన్ను నీ హృదయంలో నన్ను ఒక ప్రక్కకు నెట్టివేసినది. నన్ను ఘనపరచునట్లు గొప్ప విందు సిద్ధపరచుటకంటె ఎంతో ఎక్కువగా అన్ని విషయాలలో నేను కేంద్రముగా ఉండవలెనని కోరుచున్నాను’’ అన్నట్లుగా యేసు ఆమెతో చెప్పుచున్నట్లున్నది. క్రీస్తుప్రభవును సంతోషపరచుటకు చాలా సిద్ధపరచ వలెనని మార్త అనుకొనినది, గనుక వాటిలో ఒక్కటి కూడా విడిచి పెట్టరాదని తలంచినది. మన ప్రభువైతే ఒక చిన్న చేప ముక్క లేక ఒక తేనెపట్టు ముక్కతోనైనను తృప్తిపడియుండేవాడు! మార్తకు ఉండిన అదే అవకాశము మరియకు కూడా ఉండినది కానీ, యేసు పాదాల చెంత కూర్చునుటకే మరియ ఎంచుకొనెను.


 ప్రియ మిత్రులారా, ప్రభువు కొరకు అనేక విషయాలు చేయవలెనను మార్త వంటి ఆత్మ మనలో కూడా తలెత్తును. మనము ఎక్కువగా బోధించుచు, సండే స్కూలు నడిపించుచు, ఎన్నో కరపత్రాలు పంచుటలోను కాలము గడుపుచుందుము. అంతరంగ జీవితంలో ప్రార్థన, వాక్యమును మించి ఇతర వ్యాపకాలకు ప్రాధాన్యతనిచ్చినప్పుడు ఆత్మీయ ఆశీర్వాదాలననుభవించలేము. కావున మనమేమి చేసినను ఆయన నామములోను, ఆయన ఆత్మచేతను, ఆయన దృష్టిలో ఇష్టమైనట్లును చేయుదము.
ప్రార్ధన :- ప్రియప్రభువా, నీ పాదాల చెంత గడపకుండా చేయు తీరికలేని పరిచర్య - గోధుమలను పిండి చేయకుండా తిరుగు పిండి మిషనువంటిదని నేనర్థము చేసికొంటిని. శరీరాన్ని పోషించు ఆహారమును గూర్చి చింత కలిగియుండిన మార్తవలె నేనుండక ఆత్మను పోషించు జీవాహారమైన నీ మీదనే దృష్టియుంచిన మరియ వలె నేనుండు కృపనిమ్మని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page