top of page

02, మే 2025 శుక్రవారము || మీరెవరి మీద ఆనుకొనుచున్నారు ? మీ మీదనా, రక్షకుని మీదనా?

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • May 2
  • 1 min read

తేనెధారలు చదువుము : సామె 3:5-8



‘‘నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మికెయుంచుము’’ - సామె 3:5


సామె 3:5,6 వచనాలు బైబిలులో అత్యంత జ్ఞాపకముంచుకొనదగినవి. దేవుని మీద పూర్తిగా ఆధారపడి, అప్పగించుకొను జీవితమును ఈ వచనాలు వివరించుచున్నవి. తన ప్రియ పిల్లలమును, నిజముగా ఆయన ననుసరించువారమైన మన నుండి మన పరలోక తండ్రి కోరునది ఇదియే. పరిపూర్ణముగా ఆయన మీద ఆధారపడి, ఆయనయందు నమ్మికయుంచవలెనని మనలనాయన కోరుచున్నాడు. నమ్మికయుంచుట అనగా అర్థమిదియే. నమ్మిక తలనుండి కాక హృదయమునుండి వచ్చును. ఇది పరిశీలన వలన కలుగునది కాదు, విశ్వసించుట వలన కలుగునది. తండ్రియొక్క జ్ఞానము, విశ్వసనీయత మరియు ప్రేమలలో చిన్నబిడ్డవంటి చలించని విశ్వాసము వంటిది అది. దేవునియందు మన నమ్మకము పరిపూర్ణమైనది, సంపూర్ణమైనదిగా ఉండవలెను. దేవునియందు సగము, తనయందో, మరి దేనియందో సగము నమ్మికయుంచుట నిజముగా దేవునియందు నమ్మికయుంచుట కానేకాదు. ‘‘ఒక కాలు రాతి మీదను, మరొక పాదము జారిపోవు ఇసుక మీదను ఉంచి నిలబడువాడు రెండు పాదాలు ఆ ఇసుకపై పెట్టి నిలుచుండు వానివలెనే ఖచ్చితంగా మునిగిపోయి నశించును’’ అని జాన్ ట్రాప్గారు వ్రాసిరి. అబ్రహాము దేవుని నమ్మెను అది అతని నీతిగా ఎంచబడెను. (రోమా 4:3). ఎప్పుడైతే అబ్రహాము తన స్వబుద్ధి మీద ఆధారపడెనో అప్పుడు అతడు ఘోర వైఫల్యము చెందెను. తానున్న చోట కరువు కలిగినప్పుడు అబ్రహాము తన స్వబుద్ధిని నమ్మి ఐగుప్తునకు వెళ్ళెను (ఆ.కాం. 12:10-20). అదే ప్రకారముగా వాగ్ధాన పుత్రుడు హాగరు ద్వారానే కలుగునని అతడు తలంచెను. (ఆ.కాం. 16:1-14) అబ్రహాము అల్పవిశ్వాసము, తన స్వబుద్ధి మీద ఆధారపడుట వలన ఎన్నో సమస్యలు కలుగుటను మనమెరుగుదుము.


ప్రియ మిత్రులారా, దేవుడు సంపూర్ణ సమర్పణను కోరును. అత్యంత క్లిష్టకాలములోను ఆయనను నమ్మవలెనని ఆయన కోరును. ద్విమనస్కత కానీ, విబేధించుట కానీ లేకుండా జాగ్రత్తపడుదము.

ప్రార్ధన:- ప్రియ ప్రభువా, నా ఈ తీరికలేని జీవిత పయనంలో నీవు నాతో ఉన్నావని నమ్ము కృపనిమ్ము. అనుదినము నడిపింపు కొరకు పూర్తిగా నీయందు నమ్మికయుంచి, చంచల బుద్ధి లేకుండా సహాయము చేయుము. ఏ భయము లేకుండా క్షేమంగాను, భద్రముగాను, నీ నిత్య బాహువుల మీద ఆనుకొను కృప దయచేయుమని యేసు నామమున వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page