top of page

02, నవంబర్ 2024 శనివారము తేనెధారలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Nov 2, 2024
  • 1 min read

చదువుము : న్యాయాధి 4:4-16


మన పోరాటాలు దేవుడే పోరాడినప్పుడు మనము విజయులము

‘‘... లెమ్ము ! యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే...’’ (న్యాయాధి 4:14)

ఇశ్రాయేలులో ప్రవక్తియు, న్యాయాధిపతియునైన దెబోరా, ఇశ్రాయేలీయులు యాబీను రాజు, అతని సైన్యాధిపతిjైున సీసెరా చేతిలో శ్రమనొందుచుండుట చూచి, ఆమె బారాకును పిలిపించి, దేవుడు తన ప్రజలను శత్రువు చేతినుండి విడిపించుమని ప్రవచించి, సైన్యమును సిద్ధపరచుమని పురమాయించెను. (న్యాయాధి 4:14). సీసెరాను అతని సైన్యము దేవుడే బారాకు చేతికి అప్పగించునని ఆమె చెప్పినది. ‘‘వెళ్ళుము... ! నేను నీ దగ్గరకు... సీసెరాను తని సైన్యమును... కూర్చి రప్పించి నీ చేతికి అప్పగించెదను అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా ?’’ (న్యాయాధి 4:6,7) ఆ విధముగా ఆమె ఇదివరకు భయముతోను, నిస్పృహతోను ఉండిన జనులను ఆమె ప్రోత్సహించినది. ఆమె చెప్పినట్లే బారాకు పదివేల మందిని సీసెరా సైన్యమునకు విరోధముగా పోరాడుటకు సమకూర్చుకొనెను. కానీ బారాకు ఏమి చేసెనో గమనించుడి ! ‘‘నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళెదను గానీ నీవు నాతో కూడరాని ఎడల నేను వెళ్ళను, నాకు అవసరమైన ధైర్యము, జ్ఞానము నీ వద్ద ఉన్నదని ‘‘అతడు దెబోరాతో చెప్పెను. గనుక దెబోరా యుద్ధభూమికి అతనితో కూడా వెళ్ళగా దేవుడు సీసెరాను, అతని రథములన్నిటిని నాశనము చేసెను.



	ప్రియ మిత్రులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనము కూడా ‘‘బారాకుల’’వలె ప్రవర్తించుదుము. మనకు ఎన్నో దేవుని వాగ్ధానాలున్నను మనము హృదయపూర్వకముగా నమ్ముము. ఎందుకని ? ఎందుకంటే యుద్ధంలో మన ఎదుట ‘‘సీసెరా’’ యొక తొమ్మిది వందల ఇనుప రథాలను మనము చూచుచుందుము. దేవుడు వాగ్ధానము చేస్తే ఆయన అబద్ధమాడడని మనము గుర్తు పెట్టుకొనవలసిన అవసరమున్నది. మన వద్ద ఎట్టి ఆయుధములను లేకుండానే ‘‘ఇనున రథాలను’’ ఎలా ఎదుర్కొనగలమని ఈ లోకము మనలను చూచి నవ్వవచ్చు. ‘‘ఈ దినమే దేవుడు శత్రువును మన చేతలకు అప్పగించియున్నాడని !’’ దెబోరా ప్రకటించినట్లే మన జవాబు ప్రతిధ్వనించవలసి యున్నది’

ప్రార్ధన:- నమ్మదగిన దేవా, యుద్ధభూమిలో గుఱ్ఱాలు, రథాలతో గొప్ప సైన్యముగా నా ఎదుట నిలిచియున్న శత్రువును చూడక నీ మీదను, నిరర్ధకము కాని నీ వాగ్ధానాలయందును నా నమ్మికయుంచు కృపనిమ్ము. యుద్ధభూమిలో నీవు నాతో ఉన్నావు. నీవే నా పక్షాన పోరాడి, నా శత్రువుపై జయమిచ్చుదువని నమ్మి యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రీ, ఆమెన్.

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI - 59.

Office: +91 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page