01, మార్చి 2025 శనివారము || శనివారము
- Honey Drops for Every Soul
- Mar 1
- 1 min read
చదువుము : అ.కార్య 6:1-7
మనము పదునుగల ఆయుధాలమేనా ?
‘‘కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నేను నిన్ను నియమించియున్నాను’
- యెషయా 41:15
ప్రభువుకు తన రాజ్యం కొరకు పనిచేయుటకు క్రొత్తవైన పదునుగల ఆయుధములు అవసరమైయున్నవి, కానీ తుప్పు పట్టి, మొద్దుబారినవి కావు. ఇద్దరు వ్యక్తులు ఒక చెట్టును కొట్టుచున్న దృశ్యాన్ని ఊహించండి. ఒకరు మొద్దుబారిన గొడ్డలితోను, మరొకరు పదునుతో నరుకు వానికి పట్టిన సమయం కంటెను, శక్తి కంటెను పదునుగల దానిని ఉపయోగించిన వ్యక్తికి తక్కువగా వాడబడును గదా ? ఆ పదును గలదానినుపయోగించిన వాని పని శక్తి, సామర్థ్యాలతో కూడినదైయుండదా ? అదే విధముగా మనమును పదును గల ఆయుధములమైతే దేవుని రాజ్య పరిచర్యలో చక్కగా వాడబడుదుము. ‘‘ప్రభువా, నీ చేతులలో నన్ను ఒక పనిముట్టుగా ఉండనియ్యుము’’ అని అనేకసార్లు మనమడుగుదుము. కానీ, ఆ సాధనము ఏ స్థితిలో ఉన్నదో దానిని బట్టియే వాడబడును. దేవుని సాధనముగా మనము ఉండగోరి మనలను పదును చేయుటకు, పరిశోధింపబడుటకును పగిలిపోయి, పనికిరాని విషయాలను సరిచేయబడుటకును దేవునికి చోటిచ్చుచున్నామా ? మనము ఒకవేళ తుప్పుపట్టి, మొద్దుబారి ఉన్నట్లయితే దేవుని పనిలో పరిపూర్ణత పొందుటకు మనమే అడ్డుకొనువారమగుదుము.
ప్రత్యేకించి ప్రార్థించుటకు, వాక్య పరిచర్యకొరకు తీర్మానించుకొని, శ్రద్ధ చూపినప్పుడు మాత్రమే అపొస్తలుల ద్వారా దేవుని వాక్యము వేగముగా వ్యాపించి, యెరూషలేములో శిష్యుల సంఖ్య వేగముగా పెరిగినదని మనమీ దిన వాక్యభాగములో చదువుదుము. ప్రియ మిత్రులారా, వాక్యము మరెక్కువగా ధ్యానించుటకు సమయం తీసికొని దాని ప్రకారము మన బ్రతుకులను సరిచేసికొందము. మనము సరిచేయబడి, నీరు పూసి, వాక్యము చేత పదును పెట్టబడుటకు చోటిచ్చెదము. మన సాక్ష్య జీవితము ద్వారా ప్రభువైన యేసును వెల్లడిచేయ ఆసక్తి కలిగియుందము. మన జీవితమే ఈ లోకానికి ఆయన ప్రేమను ప్రకటించునట్లు, మన నడవడి చేత ఆయన స్వరూపమును చూపుచు, మన సంభాషణ ద్వారా ఆయనను ప్రతిబింబించునట్లు చూచుకొందము. ఆమెన్.
ప్రార్ధన :- సర్వశక్తి గల దేవా, తుప్పు పట్టి, మొద్దుబారిన సాధనంగానే నేను నీ పరిచర్య చేయ ప్రయత్నించుచున్నాను. నా నిర్లక్ష్యం చేత దేవుని రాజ్య పరిచర్య వేగవంతంగా చేయక నా వలననే అది మందకొడిగా సాగినది. గనుక, నన్ను పదునుపెట్టి నీ పరిచర్య సమర్థవంతంగా చేయునట్లు యేసు నామమున నిన్ను వేడుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com
Comments