top of page

01, మే 2025 గురువారము || అనుదినము మనము పొందుచున్న నూతన వాత్సల్యతలు

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • May 1
  • 2 min read

తేనెధారలు చదువుము : విలాప వాక్యములు 3:21-25



‘‘ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది... అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది’’ - వి.వాక్య 3:22,23


‘‘కనికరములు’’ అని ఇక్కడ బహువచనములో ఈ మాట చెప్పబడినది. నిజమే దేవుని కనికరములు బహుగానే ఉన్నవి ఎందుకంటే ఆయన వాత్సల్యతకు పరిమితి లేదు, ఎంతో బలమైనది. అది ఎడతెగక పదే పదే అల వెంబడి అల వచ్చినట్లు దేవుని సన్నిధినుండియే వచ్చును. దేవుని కరుణానది నిండుగా ఎడతెగక, ఎన్నడు ఎండిపోక ప్రవహించునది. ‘‘వాత్సల్యత’’ అను పదము హెబ్రీ పదము ‘‘గర్భము’’ అను దానినుండి వచ్చి, ఒక తల్లి తనకు జన్మించిన ఆయన అంతరంగ లోతులనుండి మన జీవితాలలోనికి ప్రవహించునది. దేవుని వాత్సల్యత ప్రతి ఉదయమున నూతనముగా ఉన్నది అని యిర్మియా ఇక్కడ చెప్పుచున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యయాత్రలో ఉన్నప్పుడు దేవుడు మన్నాను అనుదినము పంపిన విషయము జ్ఞాపకము చేసికొనుడి. ఇప్పటికిని, తన నిబంధన జనులకు దేవుడు నూతనమైన తన ప్రేమ, కనికరములను పంపననుగ్రహించుచున్నాడు. అరణ్యంలో మన్నావలెనే ఇది కూడా ప్రతి ఉదయము కలుగుచుండును. అనగా కనీసం రెండు విషయాలు అర్థమగుచున్నది. మొదటగా, నిన్నటి ఆశీర్వాదాలతో మనమెన్నడు మంచువలె మనవద్దకు వచ్చును. రెండవది, దేవుని దీవెనలు ప్రతి ఉదయమున నూతనముగా మనవద్దకు వచ్చును. ప్రభావముతో ప్రతి ఉదయమును సూర్యుడు నూతనముగా ఎలా ఉదయించునో అలాగే ప్రతి నూతన దినమున నూతనముగా దేవుని దీవెనలు మనపైకి దిగివచ్చును. ఆయన కనికరములు దినదినము వచ్చుచుండును. మనకవసరమైనవి ముందుగా కానీ, ఆలస్యముగా కానీ కాక మనకు అవసరమైనప్పుడే ఆయన పంపించును. ఈ దినమునకు కావలసినవేవో వాటిని దేవుడు అనుగ్రహించును.


ప్రియ స్నేహితులారా, ధైర్యము తెచ్చుకొందము. మనమెట్టి క్లిష్ట పరిస్థితులలో ఉన్నను దేవుని విశ్వాస్యతను గూర్చి అనుమానించక ఆయనయందే నమ్మికయుంచుదము. మన ప్రతి అడుగులోను దేవుడు నమ్మకమైనవాడుగా ఉన్నాడు. ప్రతి దినము మనము నిద్ర మేల్కొనునప్పుడు ముందుగానే దేవుడు మన పట్ల లక్ష్యముంచుచుండును. మనకు ఊపిరి ఎట్టిదో ఆయన కృప, బలము, ప్రేమ అనుదినము మన జీవితములో భాగమైయున్నవి. కావున ప్రతి నూతన దినము ఆయన చేతులను పట్టుకొని ధైర్యముతో నడిచెదము.

ప్రార్ధన :- ప్రియ ప్రభువా, ప్రతి నూతన ఉదయమున సముద్రపు అలలవలె నా మీద ప్రవహించుచున్న నీ వాత్సల్యతను బట్టి నీకు వందనములు. ప్రతి దినము నేను జీవించుటకు నీ కృప, నీ బలము నాకను గ్రహించితివి. ఎన్నడు మాట తప్పని నమ్మదగిన దేవుడవు నీవు. నీ వాక్యము నెన్నడు సందేహింపక నీయందు నమ్మిక యుంచుటకు సాయము చేయుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page