top of page

01, జూలై 2025 మంగళవారము || రాత్రి చిమ్మచీకటిగాను, అస్తమయం సమీపించుచున్నను నిరాశ చెందకుము

  • Writer: Honey Drops for Every Soul
    Honey Drops for Every Soul
  • Jul 2
  • 1 min read

తేనెధారలు చదువుము : మలాకీ 4:1-3


అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతిసూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగుజేయును...’’ - మలాకీ 4:2



క్రీస్తుపూర్వము 4 వందల సం॥ల క్రితము మలాకీ గ్రంథము వ్రాయబడినది. పాత నిబంధనలోని చివరి అధ్యాయమైన మలాకీ 4లో ప్రవక్త మెస్సయ్యను గూర్చి ఉదయించు సూర్యునివలె ఆయా రెక్కలు ఆరోగ్యము కలుగజేయునని ముందుగా చెప్పుచున్నాడు. సూర్యుడు ఉదయించునట్లే ఈ దుష్టలోకము యొక్క కనుచూపు మేరలో మెస్సయ ప్రత్యక్షమగునని, చీకటిని చెదరగొట్టుచు, స్వస్థత కలిగించుచు, ఆయన నామమందు భయభక్తులు గలవారికి విమోచన కలుగచేయును. అదే విధముగానే ప్రభుయేసు జననము ఒక సూర్యోదయము వలె ఉండెను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు చున్నారు, మరణచ్ఛాయ గల దేశనివాసుల మీద వెలుగు ప్రకాశించును అని ప్రవక్తjైున యెషయా ప్రవచించిన విధముగా జరిగెను (యెషయా 9:2). మహిమాన్వితమైన మన ప్రభువు యొక్క మొదటి రాకడలో ఇది జరిగెను మరియు ఆయన రెండవ రాకడలో ఇది ఇంకను పూర్తిగా నెరవేర్చబడవలసియున్నది. అది మాత్రమే కాక ఈ వాగ్ధానము ప్రస్తుతము మనమున్న ఈ కాలానికి కూడా చెందినది. సూర్యుడు తూర్పున ఉదయించి క్రమేణా మధ్యాకాశంలోనికి ఎక్కి భూమ్యాకాశము కలియుచోట నుండి వెలుగు రేఖలు మరియు వెచ్చదనము, ఆనందము వెదజల్లు విధముగానే ప్రభువైన యేసు నీతిసూర్యుని వలె ఆయన కృపా కిరణాలు మరియు ఆయన దయారేఖలు ప్రసరింపజేయును. ఆయనయందు విశ్వసించు ప్రతి ఒక్కరికి ఆయన వెలిగించు, లేవనెత్తి స్వస్థపరచి శుద్ధీకరించును.


ప్రియ మిత్రులారా, మన దినాలని చిక్కని చీకటిలో గాఢాంధకారములో ఉండియుండవచ్చు కానీ మనము కృంగిపోరాదు. నీతిసూర్యుడు మనలను ధైర్య పరచుటకును, న్యాయము జరిగించుటకును అలాగే కరుణించుటకును వచ్చును. అయితే మనలను మనమే ఒక ప్రశ్న వేసికొనవలసియున్నది. ‘‘దేవుని నామమునకు భయపడి, ఆయన మార్గములో మనము నడుచుచున్నామా ? అలాగైతే మన రాత్రి సమయము కొద్దిగానే యుండును. త్వరలోనే కుమారుని వెలుగు, ఆదరణ, స్వస్థత మనపై ప్రకాశించును. ఆయన ఉదయించుట కొరకు మనము ఓపికతో కనిపెట్టుదము. నిశ్చయంగా సూర్యుని వలెనే ఆయన ప్రకాశించును.

ప్రార్ధన :- ప్రియ ప్రభువా, ప్రతి సూర్యోదయమున సూర్యుడుదయించి వెలుగు, వేడి, సంతోషము ఎలా తప్పక కలిగించునో అలాగే నీవును నామీద ఉదయించి, నేను నీ నామమందు భయభక్తులు కలిగియున్నందున నా చీకటినంతటిని పారద్రోలుదువు. ఓపికతో కనిపెట్టియుండి నీ మహిమాన్వితమైన వెలుగు కొరకును, మంచి ధైర్యము నొందుటకును నిరీక్షించు కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.

తేనెధారలు

Our Contact:

EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59

Office : M: 9444456177 || https://www.honeydropsonline.com

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page