13. ఆగప్పు 2025 బుధవారము || యహాూాఘషఘువ - అనుసరలించుటకు జక మాదిరి
- Honey Drops for Every Soul

- Aug 13, 2025
- 1 min read
తేనెధారలు చదువుము : యెహోషువ 5:13-15
“అంతకు యెహోవా మోషేతో ఇట్లనెను - నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతని తీసికొని...” - సంఖ్యా కాం. 27:18
బైబిలునందు చెప్పబడిన గొప్ప నాయకులలో యెహోషువ ఒకరు. అట్టి గొప్ప నాయకునిగా చేసిన అతనిలోని లక్షణాలేమైయున్నవి ? మొదటిగా, అతడు ప్రార్ధనాపరుడు. “దేవునితో గడిపి మోషే తిరిగి వచ్చువరకు కూడా అతని సహాయకుడు, యవ్వనస్థుడైన నూను కుమాజిడైన యెహోషువ గుడారమునుండి బయటకు రాలేదు” (నిరమ 38:11). రెండవది, యెహోషువ విధేయత గలవాడు. అతడు దాసునివలె విధేయత చూపువాడు, మరియు యుద్ధవీరుడు, ఒక నాయకుడు కూడా. మోషే మరణించిన పిదప ఇశ్రాయేలీయులను నడిపించుమని దేవుడతనికి ఆజ్ఞాపించినప్పుడు యెహోషువ వెంటనే ఆ బాధ్యత చేపట్టెను. (యెహోషువ 1:10) యొరికోను ముట్టడించుటకును దేవుడతనికిచ్చిన ప్రతి ఆజ్ఞను, ప్రతి ఆదేశమును తప్పకుండా స్వీకరించి విధేయుడాయెను. మూడవది, అతడు గొప్ప విశ్వాసవీరుడు. అతడు అమాలేకీయులతో పోరాడినప్పుడు అతని ధైర్యము కనబరచెను. (నిర్ద.కాం. 17:13). కనానును వేగుచూచుటకు వెళ్ళివారిలో ఉండి వారికి విరోధంగా ధైర్యంగా నిలిచి తప్పక కనాను దేశమును స్వాధీనం చేసికొందుమని చెప్పి కాలేబు పక్షాన నిలిచినవాడు. “థైర్యమనునది క్రియలలో చూపు విశ్వాసమే” అని జాన్ సి మాక్స్‌వెల్‌గారు వ్రాసిరి. నాల్లవదిగా, యెహోషువ గొప్ప నిబద్దత లేదా అంకితభావమును. కనుబరచెను. తన ప్రాణమొడ్డుటకును ఇష్టపడుటలో మనమా స్థాయిని చూడగలము. లెక్కలేనన్ని విస్తారమైన యుద్దాలు అతడు చేసెను (యెహోషువ 10). అయినను దేవుని పనికొరకు శ్రేష్టముగా పనిచేయక మానలేదు.
ప్రియ మిత్రులారా, పేరు ప్రఖ్యాతులు గలదాని కంటె ఏది సరైనదో దానికే యెహోషువ ఎల్లప్పుడు విలువనిచ్చెను. ఆయన చక్కగా ప్రవర్తించుటయే కాక ఇతరులకు మాదిరికరంగా జీవించుటకు ప్రయత్నించెను. తత్భలితంగా తన సామర్దానికి మించిన నాయకునిగా బ్రదికెను. ఒక మంచి నాయకునిగా యెహోషువ చూపిన మాదిరిని మనము ప్రయత్నించుదము.ప్రార్ధన :- ప్రేమగల పరలోక తండ్రీ, యెహోషువ జీవితాన్ని బట్టి వందనాలు. అతని ప్రార్ధన జీవితము, గొప్ప విశ్వాసము, దృఢ నిశ్చయత నాకు ప్రేరణగా ఉండును గాక. నీ స్వరానికి లోబడి నీవిచ్చిన ప్రతి ఆజ్ఞను శిరసావహించి, ఒక మంచి నాయకునిగా ఉండ దయచూపుమని యేసునామమున ప్రార్ధించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177




Comments