07, జూలై 2025 సోమవారము || దేవుడు మాత్రమే ఎవరినైనను మార్చగలడు
- Honey Drops for Every Soul

- Jul 7, 2025
- 2 min read
తేనెధారలు చదువుము : యిర్మియా 17:9-14
‘‘కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా ?... కీడు చేయుటకు అలవాటుపడిన మీరును మేలు చేయవల్లపడదు.’’ - యిర్మియా 13:23
కొన్ని విషయాలు మనుష్యులు చేయగలిగినవి ఉన్నవి. తెల్లగా ఉండే ఒక వ్యక్తి తన చర్మము నల్లగా మారేవరకు ప్రయత్నించవచ్చు. కానీ కొన్ని విషయాలు మనిషి చేయలేనివి ఉన్నవి. నల్లగా ఉన్న వ్యక్తిని తెల్లగా మనము మార్చలేము. నిటారుగా ఉన్న ఒక ఎత్తయిన కొండ మీదనుండి దూకుట సులువేమో కానీ ఆ శిఖరము పైకి ఒక్క ఉదుటున దూకుట ఎంత కష్టము ! పాపము చేసి తనను తాను ఒక వ్యక్తి అపవిత్రపరచుకొనుట సులువే కానీ అతడెంత కావాలనుకొనినను తనను తాను ఆత్మీయంగా శుద్ధీకరించుకొనలేడు. సులువుగానే అతడు ఎంతైనా పాపము చేయగలడు, పదే పదే చేయవచ్చు, దానివలన ఏ మాత్రము విసిగిపోకుండ ఉండవచ్చు కానీ, సరైన మార్గములోనికి మరలుకొనుట చాలా కష్టము. ఇథియోపీయుడు తన చర్మము మార్చుకొనుట నిజముగా అసాధ్యమే, అయితే ఒక పాపి తనంతట తన పాపమును పోగొట్టుకొనుట అనే ప్రశ్న ఏమాత్రము లేదు. ఎందుకనగా మార్చబడవలసినది అతని చర్మము కాదు కానీ అతని హృదయమైయున్నది’’.
ప్రియ మిత్రులారా, ప్రాథమికమైన మనంతట మనమే ఎన్నటికి పరిష్కరించుకొనలేని కఠినమైన ఆత్మీయ సమస్య మనలో ప్రతి ఒక్కరికి కలదని బైబిలు చెప్పుచున్నది - అదియే పాపము. పాపము మందకొడిగా వ్యాపించు రోగకారక సూక్ష్మజీవి వంటిది, లేక ఒక నదిలో కలిపిన విషపూరితమైన రసాయనము వంటిది.
స్వార్థముగా ఉండుట చేతను, దేవునికి తిరుగుబాటు చేయుటతోను పాపము దానతంట అదే ప్రకటితమై మనమెంత ప్రయాసపడినను దానిని జయించలేనిదిగా ఉండును. మనము చర్చికి వెళ్ళి బోధనలు వినుచున్నను బాహ్యమైన వాటివలనే ఏ ప్రయోజనము ఉండదు. మన రాతిగుండెను అవి ఎన్నటికిని మాంసపు హృదయము లేక మెత్తని హృదయముగా మార్చలేవు. మన పాప స్వభావాలను మనమేమాత్రము మార్చకొనలేము. దేవుడు మాత్రమే మనకు నూతన హృదయము నియ్యగలడు. ప్రభువైన యేసు మాత్రమే మనలను శుద్ధీకరించి, క్షమించి నూతన సృష్టిగా మార్చగలడు. మనము పీల్చుకొను గాలి మనకెంత అవసరమో ఆయన మనకంత అవసరము. ఇప్పుడే లేచి మన రక్షకుని వద్దకు వెళ్ళి నిన్ను లోనుండి మార్పు చెందించు ఆయన రూపాంతరము చెందించు శక్తిని అనుభవించుము. ప్రార్థన : ప్రియ ప్రభువా, స్వార్ధముతోను, తిరుగుబాటుతోను నేనింతవరకు జీవించితిని. ‘‘నా హృదయమును మార్చు దేవా !’’ అని దావీదు ప్రార్థించినట్లు నేనును నీకిష్టమైన వ్యక్తిగా నను మార్చుమని ప్రార్థించుచున్నాను. నన్ను మార్చి నూతన సృష్టిగా నీవు మాత్రమే మార్చుదువు గనుక శుద్ధీకరించి పవిత్రపరచుమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రీ, ఆమెన్.
తేనెధారలు
Our Contact:
EL-SHADDAI LITERATURE MINISTRIES TRUST, CHENNAI-59
Office : M: 9444456177 || https://www.honeydropsonline.com




Comments